నరేంద్ర మోడీ జూన్ 8 నే ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తున్నారు? దీనివెనకున్న ఏమైనా రహస్యం ఉందా?
ముచ్చటగా మూడో సారి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. మోడీ జూన్ 8 న ప్రమాన స్వీకారం చేయనున్నారు. అయితే ఈ తేదీనే ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో తెలిస్తే అందరూ షాక్ అవుతారు తెలుసా?
ఈ జూన్ 8న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మోడీ పెద్ద పెద్ద ఈవెంట్లలో 8వ నంబర్ కనిపించడం ఇది మొదటిసారైతే కాదు. అవును ఎందుకంటే 8 నంబర్ మోడీకి బాగా కలిసి వస్తుందట. అందుకే పెద్ద పెద్ద ఈవెంట్లకు మోడీ ఈ తేదీనే ఫిక్స్ చేస్తారట. అసలు న్యూమరాలజీలో 8 నంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం పదండి.
సంఖ్యాశాస్త్రంలో 8 సంఖ్య శని గ్రహాన్ని సూచిస్తుంది. అలాగే 8 న్యాయానికి చిహ్నం కూడా. నోయిడాకు చెందిన న్యూమరాలజిస్ట్ రాహుల్ సింగ్ మాట్లాడుతూ.. 8 నంబర్ రాజయోగాన్ని సూచిస్తుంది. సాధారణంగా శని ప్రభావం ఉన్నవారు జీవితంలో విజయానికి ఆలస్యంగా చేరుకుంటారు. కానీ ఈ విషయం ఊహించని విధంగా చాలా గొప్పగా ఉంటుంది. అంటే వీరు శత్రువులందరినీ ఓడించి విజయాన్ని చేరుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీకు గుర్తుందా? నవంబర్ 8న రాత్రి 8 గంటలకు పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఇది మోదీ తొలిసారిగా అధికారం చేపట్టినప్పుడు తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి. అలాగే మోడీ 2015 సెప్టెంబర్ 26న డిజిటల్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఎనిమిది ఏడుంది అని డౌట్ రావొచ్చు. ఈ సంఖ్యల కలిపితే 8 ది వస్తుంది. 2+6 = 8, 2 + 0 + 1 + 5 = 8 అన్న మాట.
ఇకపోతే నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న జన్మించారు. ఈ ఒకటిని, ఏడును కలిపితే 8 వస్తుంది. 8 వ సంఖ్య 8 వ తేదీన జన్మించిన వ్యక్తులకు మాత్రమే కాదు ఎవరికైనా ఇది అదృష్టంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. భారతదేశానికి కూడా ఎనిమిదో సంఖ్య ముఖ్యమని జ్యోతిష్కుడు శైలేంద్ర పాండే చెప్తున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26, ఆగస్టు 8వ సంఖ్యను సూచిస్తుంది. రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు ఇది. 2024 తో ఒక విచిత్రమైన యాదృచ్ఛికత కూడా ఉంది. ఇక పోతే ఈ సంవత్సారాన్ని కలిపితే కూడా 8 వస్తుంది. (2+0+2+4 =8)
న్యూమరాలజిస్ట్ రాహుల్ సింగ్ మాట్లాడుతూ.. జూన్ 8న ప్రమాణ స్వీకారం యాదృచ్ఛికం కాదు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంఖ్య ప్రభావాన్ని అర్థం చేసుకున్నారు. ఎనిమిదో నెంబరు ప్రభావం ఆయనను ప్రధానిని చేస్తుందని ఆయన అన్నారు.
అయితే జూన్ 8 న ప్రమాణ స్వీకారం విషయంలో నరేంద్ర మోడీ కాస్త ఆలోచించాలన్నారు. ఒక్క తేదీపైనే కాకుండా ప్రతిజ్ఞ చేసే సమయం, శుభముహూర్తంపై కూడా దృష్టి పెట్టాలని జ్యోతిష్కుడు శైలేంద్ర పాండే తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసే టైమింగ్ కీలక పాత్ర పోషిస్తుందట. రాబోయే ఐదేళ్లు ప్రభుత్వానికి ఎలా ఉండబోతున్నాయో, ఎలాంటి సవాళ్లు, అవకాశాలు ఎదురవుతాయో ఈ ముహూర్తం వెల్లడించనుంది. అందుకే కేవలం అంకెల ఆధారంగానే నిర్ణయం తీసుకోలేమన్నారు . అయితే ఎన్నికలు, ప్రమాణస్వీకారం విషయానికొస్తే ఇతర గ్రహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఎనిమిదో సంఖ్య న్యాయానికి చిహ్నం. అందుకే దాని ఆధీనంలో ఉన్నవారు తమ పనిలో నైతికంగా బలంగా ఉండాలి. వీళ్లు సానుకూల రీతిలో ప్రవర్తిస్తే శని వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయదు. కానీ చెడుగా ప్రవర్తిస్తే శని శిక్షించగలడు. శని శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది సంఖ్యల స్వభావమని జ్యోతిష్యులు అంటున్నారు.