కాలికి నల్ల దారం కట్టుకున్నారా..? ఈ రాశుల వారికి మహా ప్రమాదం..!
నల్లదారాన్ని కట్టుకునే ముందు.. జోతిష్యుల సలహా తీసుకోవాలట. ఎందుకంటే నల్లదారం శని దేవుడితో సంబంధం ఉంటుంది. కాబట్టి.. అన్ని రాశుల వారికి నల్లదారం మేలు చేయకపోవచ్చు.
చాలా మంది తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. దిష్టి తగలకుండా ఉండాలని, ఎవరి చెడు కన్ను పడినా దాని ప్రభావం తగలకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు నల్లదారాన్ని శని దేవుడితో ముడి వేస్తారు. పౌరాణనిక విశ్వాసాలను దృష్టిలో ఉంచుకొని నల్లదారాన్ని కట్టుకుంటే, మరి కొందరు ఫ్యాషన్ కోసం కట్టుకుంటారు. కానీ.. ఎవరు పడితే వాళ్లు... నల్లదారం కట్టుకోకూడదట. కొందరికి నల్లదారం కట్టుకోవడం వల్ల లాభం కలిగితే.. మరి కొందరికి నష్టం కలుగుతుందట. మరి.. ఇది ఎవరు కట్టుకోకూడదో తెలుసుకుందాం...
నల్లదారాన్ని కట్టుకునే ముందు.. జోతిష్యుల సలహా తీసుకోవాలట. ఎందుకంటే నల్లదారం శని దేవుడితో సంబంధం ఉంటుంది. కాబట్టి.. అన్ని రాశుల వారికి నల్లదారం మేలు చేయకపోవచ్చు.
telugu astrology
1.మేష రాశి...
మేష రాశి వారికి నల్లదారం ధరించడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే... నల్లదారం శని, రాహువు తో అనుసంధానమై ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం మేష రాశివారికి అధిపతి అయిన కుజుడు... శని శత్రుత్వంతో ఉంటుంది. అందుకే మేష రాశివారికి నల్లదారం ధరించడం వల్ల ధైర్యం తగ్గిపోతుంది. శ్రమ పెరుగుతుంది. అందుకే.. ఈ రాశివారు నల్లదారం ధరించడం వల్ల.. లాభం కంటే నష్టమే ఎక్కువ.
telugu astrology
2.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు కూడా నల్లదారం కట్టుకోకూడదు. చంద్రుడు, శని కర్కాటక రాశికి అధిపతి అయిన రాహువు మధ్య కూడా శత్రుత్వం ఉంటుంది. దాని ప్రభావం ఆ రాశులవారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు నల్లదారం కట్టుకుంటే... మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందట.
శని ప్రభావం వల్ల మీ పనికి కూడా ఆటంకం కలగవచ్చు.
telugu astrology
3.సింహ రాశి..
సింహరాశి వారికి నల్ల దారం కట్టడం అశుభం. మీ రాశికి అధిపతి సూర్యభగవానుడు, అతనికి శని దేవుడితో శత్రుత్వం ఉంది. మీ ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు, తండ్రీకొడుకుల మధ్య గొడవలు రావచ్చు. కాబట్టి నల్ల దారం ధరించవద్దు.
telugu astrology
4.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు పొరపాటున కూడా నల్ల దారం ధరించకూడదు. కుజుడు మీ రాశికి అధిపతి , శనితో శత్రుత్వం కలిగి ఉన్నాడు. నల్ల దారం ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
గమనిక: ఇక్కడ సమాచారం జ్యోతిష్య సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దేనికైనా సంబంధిత నిపుణులను సంప్రదించి ముందుకు సాగండి.