Zodiac signs: ఈ రాశులవారు ఎప్పుడూ గొడవలకు ముందుంటారు..!
Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారు గొడవలలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. వీరు ఏదైనా గొడవలో తల దూర్చినప్పుడు వీరిని ఆపడం కష్టం.

Zodiac signs
జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశికీ వేర్వేరు లక్షణాలు ఉంటాయి. కొన్ని రాశుల వారు గొప్పగా మాట్లాడతారు. వారు తమ పనులన్నింటినీ మాటల ద్వారా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కొన్ని రాశుల వారికి మాటలతో ఆకట్టుకునే టాలెంట్ ఉండకపోవచ్చు. ఏది పడితే అది మాట్లాడతారు. ఈ మాటల కారణంగా గొడవలు రావచ్చు. ముఖ్యంగా కొన్ని రాశులలో పుట్టిన వారు.. ప్రతి దాంట్లో గొడవకు దిగుతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం.....
మేష రాశి....
మేష రాశిని కుజుడు పాలిస్తాడు. వీరికి ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. వారు ఏదైనా విషయం గురించి ఓపికగా ఆలోచించలేరు. వారికి కోపం కూడా చాలా ఎక్కువ. ఈ కోపంలో ఏది ఒప్పు, తప్పు అనే విషయం గురించి వీరు ఆలోచించరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. కానీ, వీరు ఎవరితో అయినా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారికి, కోపం మాటల కంటే ఒక అడుగు ముందుంటుంది. యుద్ధానికి, ధైర్యానికి ప్రతీక అయిన కుజుడు పాలించే మేషం అగ్నిపర్వతం లాంటిది. వారు ఎవరి మాటలకు ఎప్పుడూ భయపడరు. ఎవరైనా వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తే.. వారు దృఢంగా నిలపడతారు. వీరు ఎప్పుడూ ఎక్కువగా గొడవలు పడుతూనే ఉంటారు.
మిథున రాశి....
మిథున రాశిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు అందరినీ ప్రేమిస్తారు. వారు తమ స్నేహితులను కూడా తమ కుటుంబ సభ్యుల్లా చూసుకోగలరు. తమ కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ, ప్రేమ కలిగి ఉంటారు. అందుకే, తమ ప్రియమైన వారిని ఎవరైనా ఎదురిస్తే... వీరు తట్టుకోలేరు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎదుటి ఉన్న వ్యక్తి ఎవరైనా సరే..వీరు ఎదురిస్తారు. గొడవలు పడతారు. ఏది తప్పు, ఏది ఒప్పు అని కూడా ఆలోచించరు.
సింహ రాశి...
సింహ రాశిని సూర్యుడు పాలిస్తూ ఉంటాడు. సూర్యుడు నాయకత్వ లక్షణాలను సూచించే గ్రహం. అందువల్ల, సింహ రాశి వారికి ఎల్లప్పుడూ రాజు లక్షణాలు ఉంటాయి. వారు ఎవరినీ మోసం చేయడానికి ఇష్టపడరు. కానీ వీరికి గొడవల్లో దూరం అంటే బలే సరదా. వీరికి ఇతరుల నుంచి మాటలు పడటం నచ్చదు. వెంటనే కోపం వచ్చేస్తుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే.. వారు సహించరు. చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. ఆవేశంగా గొడవలకు వెళ్లిపోతారు.
వృశ్చిక రాశి...
వృశ్చిక రాశిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ గ్రహం ధైర్యం, యుద్ధాన్ని సూచించే గ్రహం. ఈ రాశివారికి సహజంగా గొడవలు పెద్దగా నచ్చవు. కానీ.. ఇతరులను రెచ్చ గొట్టేలా మాట్లాడటంలో వీరు ముందుంటారు. వీరి మాటల కారణంగా.. ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి.
కన్య రాశి...
కన్య రాశిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు తమ తప్పులను అంగీకరించి అందరితో కలిసి ఉండే వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. దీనికి వ్యతిరేకంగా వెళ్ళే వారి నుండి వారు దూరంగా ఉంటారు. సద్గుణాలను పెంపొందించుకోని వారికి దూరంగా ఉండాలని వారు కోరుకుంటారు. కన్య రాశి వారు చెడు వ్యక్తులు పేదలకు, పేదలకు, అనాథలకు ఇబ్బంది కలిగిస్తే సహించరు. వారు మంచివారితో కలిసి నిలబడి వారికి వీలైనంత సహాయం చేస్తారు. మంచిని వ్యతిరేకించే వారితో వీరు గొడవలు పడతారు.