Birth Date: ఈ తేదీల్లో జన్మించిన వారు ఏ రత్నం ధరిస్తే మంచిదో తెలుసా?
ఈ తేదీల్లో జన్మించిన వారు ఎక్కువగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. అయితే.. ఎవరైనా ఏదైనా మాట అంటే వీరు వెంటనే మనసుకు తీసుకుంటారు. చిన్న మాట అన్నా హర్ట్ అయిపోతారు.

Birth Date
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 2, 11, 20 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారంతా సహజంగా చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరిలో క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు ఎక్కువగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. అయితే.. ఎవరైనా ఏదైనా మాట అంటే వీరు వెంటనే మనసుకు తీసుకుంటారు. చిన్న మాట అన్నా హర్ట్ అయిపోతారు. మరి.. ఈ తేదీల్లో జన్మించిన వారు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే..ఎలాంటి రత్నం ధరించాలి? ఏ రత్నం ధరిస్తే.. శుభ ఫలితాలు లభిస్తాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
నెంబర్ 2..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2 కి చెందిన వ్యక్తులు ముత్యాలు ధరించడం ఉత్తమంగా పరిగణిస్తారు. ముత్యం చంద్రుడిని సూచిస్తుంది. మనస్సు, భావోద్వేగాలు, అంతర్ దృష్టిని నియంత్రించడానికి ఈ ముత్యాలు సహాయపడతాయి. సహజంగా ఈ తేదీలో జన్మించిన వారు భావోద్వేగ అస్థిరత, ఆందోళన, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు.అందుకే, వారు ముత్యం ధరించడం వల్ల.. ఆ సమస్యలు తగ్గుతాయి. మేలు జరుగుతుంది. ముత్యంతో పాటు.. తెల్లటి పుష్పరాగం వంటి ఇతర రత్నాలను కూడా వీరు ధరించవచ్చు.
ముత్యం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు...
జ్యోతిషశాస్త్రంలో, ముత్యాన్ని చాలా శుభప్రదమైన రత్నంగా భావిస్తారు. దీనిని చంద్రుని రత్నంగా పరిగణిస్తారు. ఇది శాంతి, శ్రేయస్సు, భావోద్వేగ సమతుల్యతకు చిహ్నం. జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతకం లో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఖచ్చితంగా ముత్యాన్ని ధరించాలి. అలాగే, ఒక వ్యక్తి తన వివాహ జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, అతను ఖచ్చితంగా ముత్యాన్ని ధరించాలి. దీని నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు.
ముత్యాన్ని ఏ రోజు ధరించాలి..?
సోమవారం చంద్ర గ్రహంతో సంబంధం కలిగి ఉన్నందున సోమవారం ముత్యాన్ని ధరించడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. బంగారం కంటే.. వెండితో కలిపి ముత్యాన్ని ధరించడం ఉత్తమం. ముత్యాన్ని కుడి చేతి చిన్న వేలుకు ధరించాలి. ఈ నెంబర్ 2 లో జన్మించిన వారు ముత్యం ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా నియంత్రణలో ఉంటుంది.