ఇంట్లో ఐరన్ వస్తువులు ఎక్కడ ఉంచాలో తెలుసా?
ఇంట్లో ఐరన్ ఉంచుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాని వల్ల జరిగే మంచి ఎంత ఉందో..దాని వెనకే చెడు వచ్చే ప్రమాదం కూడా అంతే ఉంది.
ఆరోగ్యానికి మంచిది కాదని నాన్ స్టిక్, అల్యూమినియం గిన్నెలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో.. అందరూ ఆరోగ్యం కోసం ఆలోచించి.. వాటి స్థానంలో... ఐరన్, స్టీల్ వస్తువులు వాడటం మొదలుపెట్టారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ మనం వంటకు ఉపయోగించే ఐరన్ వస్తువులను.. ఇంట్లో ఏ దిక్కున పడితే అక్కడ ఉంచకూడదట. వాస్తు ప్రకారం.. మరి ఐరన్ వస్తువులను ఎక్కడ ఉంచాలో ఈరోజు తెలుసుకుందాం...
ఐరన్ అంటే ఇనుము రెండు గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుందట. దాని నుంచి మనకు శుభాలు జరుగుతున్నాయంటే శని గ్రహం ఆధీనంలో ఉందని.. అలా కాకుండా... చెడు జరుగుతోంది అంటే.. అది రాహువు ఆధీనంలో ఉందని అని పరిగణిస్తారట. అందుకే.. ఇంట్లో ఐరన్ ఉంచుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాని వల్ల జరిగే మంచి ఎంత ఉందో..దాని వెనకే చెడు వచ్చే ప్రమాదం కూడా అంతే ఉంది.
అటువంటి పరిస్థితిలో, ఇంట్లో ఇనుము ఉంచినట్లయితే, దానిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. అదే సమయంలో, ఏదైనా ఇనుప వస్తువును ఇంటి వంటగదిలో ఉంచినట్లయితే, దాని స్థానం సముచితమైనదిగా ఉంటుంది. మీ వంటగదిలో ఇనుప వస్తువులు లేదా పాత్రలు ఉంటే, వాటిని పశ్చిమ దిశలో ఉంచండి.
పశ్చిమ దిశ శనిదేవుని దిక్కుగా భావిస్తారరు. అటువంటి పరిస్థితిలో, ఈ దిశలో వంటగదిలో ఇనుప పాత్రలను ఉంచడం శుభం. శని దేవుడి అనుగ్రహాన్ని తెస్తుంది. శనిదేవుడు సంతోషిస్తాడు. శని దోషం నుండి విముక్తి పొందుతారు. శని గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి.
ఇది కాకుండా, వంటగదిలో ఇనుప పాత్రలు లేదా మరేదైనా వస్తువు పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఉంచండి. ఏదైనా ఇనుప పాత్ర శిథిలమై అంటే విరిగిపోయినట్లయితే దానిని వంటగదిలో ఉంచకూడదు.
ఎందుకంటే అన్నపూర్ణా దేవి వంటగదిలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వంటగదిలో స్వచ్ఛమైన వస్తువులను మాత్రమే ఉంచాలి. లేదంటే.. ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటంుది.