మీరు పుట్టిన తేదీ ప్రకారం.. ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలుసా?
న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన తేదీని బట్టి... ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఈరోజు తెలుసుకుందాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం..ఎందులో పెట్టుబడులు పెడితే మీకు కలిసొస్తుందో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ... వ్యాపారాల్లో రాణించాలని, తమ సంపాదన పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే... ఎందులో పెట్టుబడులు పెట్టాలో చాలా మందికి అవగాహన ఉండదు. న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన తేదీని బట్టి... ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఈరోజు తెలుసుకుందాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం..ఎందులో పెట్టుబడులు పెడితే మీకు కలిసొస్తుందో తెలుసుకుందాం.
1.సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 అంటే... 1. 10, 19, 28 తేదీల్లో పుట్టిన వ్యక్తులు కాస్త అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వీరికి ఎక్కడ పెట్టుబడి పెట్టినా బాగానే కలిసి వస్తుంది. కాబట్టి వీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2 అంటే... 2,11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి ఏవైనా భూములు, లేదంటే.. ఇతర ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెడితే బాగా కలిసొస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది.
సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రాకారం నెంబర్ 3 అంటే... 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారికి షేర్ మార్కెట్లు బాగా కలిసొస్తాయి. కాస్త షేర్ మార్కెట్ల పట్ల అవగాహన పెంచుకుంటే...వీరు సంపాదనను బాగా పెంచుకోవచ్చు. అయితే.. గుడ్డిగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకుండా.. కాస్త నేర్చుకొని తర్వాత ముందడుగు వేయడం మంచిది.
సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం.. నెంబర్ 4 అంటే... 4, 13,22, 31 తేదీల్లో పుట్టిన వారికి కూడా షేర్ మార్కెట్లు కలిసొస్తాయి. షేర్ మార్కెట్ల గురించి తెలుసుకొని.. ముందడుగు వేస్తే... బాగా కలిసొస్తుంది.
సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 అంటే... 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారికి కూడా షేర్ మార్కెట్లు బాగానే కలిసొస్తాయి. వీళ్లు కూడా అంతే.. తెలిసీ తెలియకుండా తొందరపాటుతో పెట్టుబడి పెట్టకుండా.. కాస్త తెలుసుకని ముందడుగు వేయాలి. అవగాహన ఉంటే.. షేర్ మార్కెట్లో బాగా రాణించవచ్చు.
సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 6 అంటే... 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి బంగారం బాగా కలిసొస్తుంది. వీరు బంగారంలో పెట్టుబడులు పెడితే... బాగా కలిసొస్తుంది. కాబట్టి.. ఆ దిశగా ఆలోచించవచ్చు.
సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 7 అంటే... 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి కూడా బంగారం బాగా కలిసొస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారంలో పెట్టుబడులు పెట్టొచ్చు. మంచి ఫలితాలు లభిస్తాయి.
సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 8 అంటే... 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు, భూమి, ప్రాపర్టీలు వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే... వీరి సంపాదన పెరుగుతుంది. బాగా కలిసొస్తుంది.
సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 9 అంటే... 9, 18, 27 తేదీల్లో పుట్టిన వ్యక్తులు కాస్త అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వీరికి ఎక్కడ పెట్టుబడి పెట్టినా బాగానే కలిసి వస్తుంది. కాబట్టి వీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.