ఉదయాన్నే నిద్ర లేస్తూనే మీరేం ఆలోచిస్తారు? మీ రాశి ఏం చెబుతోందో తెలుసా...
ఉదయం లేస్తూనే కొత్త ఉత్సాహంతో మొదలుపెడితే రోజంతా ఉల్లాసంగా.. రెట్టించిన శక్తితో గడిచిపోతుంది. అయితే కొంతమందికి పక్కమీది నుంచి లేవాలంటేనే బద్ధకం, మరికొందరికి మళ్లీ ఎప్పడు పడుకుందామా.. అనే ఆలోచనే.. అయితే ఇదంతా మీ తప్పు కాదట.. మీ రాశి చేసే నేరమేనట..

మేషరాశి (Aries) : హుషారుగా నిద్రి లేస్తారు. ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధం అన్నట్టుగా రెడీ అయిపోతారు.
వృషభరాశి (Taurus) : ఉదయం లేవాలంటే వీరికి తెగ బద్ధకం. అలారం వస్తే దాని పీకనొక్కి మరో గంట దుప్పటి ముసుగేస్తారు.
Gemini
మిధునరాశి (Gemini) : పూర్తిగా కళ్లు తెరవకుండానే.. ఫోన్ కోసం చుట్టూ వెతుకుతారు. ఉదయం లేస్తూనే చేసే మొదటి వీరిది ఇదే..
కర్కాటకరాశి (Cancer) : ఏదో తెలియని కోపంతో, చికాకుతో లేస్తారు. అంతేకాదు తమను అందరూ అసహ్యించుకుంటారన్న భావనలో ఉంటారు.
Leo Zodiac
సింహరాశి (Leo) : ఏదో పీడకలతోనో.. ఏవరో డోర్ బెల్ కొడితేనో మేల్కొంటారు. అబ్బా.. ఎవరదీ అని విసుగుతో లేస్తారు.
Virgo
కన్యారాశి (Virgo) : అలిసిపోయినట్టుగా ఫీలవుతారు. ఏదో జబ్బుపడి లేచినట్టుగా... నీరసంగా, చేతగానట్టుగా ఉంటారు.
Libra
తులారాశి (Libra) : లేస్తూ లేస్తూనే పనిలో పడిపోవాలని చూస్తుంటారు. అయితే ఏ బట్టలు వేసుకోవాలా? అంటూ ఆలోచిస్తూ వార్డ్ రోబ్ ముందు టైం వేస్ట్ చేస్తుంటారు.
వృశ్చికరాశి (Scorpio) : వీరు లేవడం లేవడమే.. ‘అబ్బా ప్రపంచం ఎంత చీకటిగా ఉంది’ అనుకుంటూ లేస్తారు. అలాగని చీకటంటే వీరికి భయం కాదు.
Sagittarius
ధనుస్సురాశి (Sagittarius) : ఏదో తెలియని ప్రపంచంలో ఉన్నట్టు.. అపరిచిత ప్రదేశంలో విహారానికి వెళ్లినట్టు కలగంటుంటారు. తాము ఎక్కడున్నాం.. ఇక్కడికి ఎలా వచ్చాం అని ఆశ్చర్యపోతారు.
Capricorn
మకరరాశి ( Capricorn) : లేస్తూ.. లేస్తూనే.. ఆ రోజు ఏమేమి పనులు చేయాలి. ఎలా చేయాలి.. అంటూ లిస్ట్ ముందేసుకుంటారు.
కుంభరాశి (Aquarius) : వీరిది నార్సిసిస్టిక్ స్వభావం. దేవుడు ఉన్నాడని... తమకు కనిపించి.. మాట్లాడుతున్నాడని భావిస్తారు.
Pisces Zodiac
మీనరాశి ( Pisces) : వీరికి నిద్ర అంటే బంగారం. నిద్రనుంచి లేస్తూనే..మళ్లీ ఎప్పుడు నిద్రపోవచ్చు అని ఆలోచిస్తారు.