Birth Month: ఏ నెలలో పుట్టిన అమ్మాయికి ఎలాంటి భర్త వస్తాడో తెలుసా?
Birth Month: మనం పుట్టి తేదీ, సమయం మాత్రమే కాదు, నెలను ఆధారంగా చేసుకొని కూడా వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పుట్టిన నెల ఆధారంగా అమ్మాయిలకు ఎలాంటి భర్త వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

1.జనవరి...
జనవరిలో పుట్టిన అమ్మాయిలకు సహజంగా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో చాలా బాధ్యతగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలకు శాంతమైన, సహనమున్న, చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి భర్త గా వస్తారు.
2.ఫిబ్రవరి..
ఫిబ్రవరిలో పుట్టిన అమ్మాయిలకు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. వీరు చాలా ఎమోషనల్ గా కూడా ఉంటారు. ప్రేమకు చాలా ఎక్కువ విలువ ఇచ్చే స్వభావం కలిగి ఉంటారు. అలాంటి ఈ అమ్మాయిలకు ఆప్యాయతోతో చూసుకునే, కుటుంబానికి ఎక్కువ విలువ ఇచ్చే, నమ్మకంగా ఉండే అబ్బాయి భర్తగా వస్తాడు.
3.మార్చి...
మార్చిలో పుట్టిన అమ్మాయిలు చాలా నిజాయితీగా ఉంటారు. వీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరికతో ఉంటారు. అంతేకాదు.. అందరిపట్ల చాలా దయతో కూడా ఉంటారు. అయితే... ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయికి ఆత్మవిశ్వాసంగా, అన్ని సమయాల్లో సపోర్ట్ గా ఉండే, జీవితంలో ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకునే అబ్బాయి భర్తగా వస్తాడు.
4.ఏప్రిల్...
ఏప్రిల్ లో పుట్టిన అమ్మాయిలు జీవితంలో చాలా క్లారిటీ కలిగి ఉంటారు. వీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు. చాలా చురుకుగా కూడా ఉంటారు. ఇలాంటి అమ్మాయిలకు బాగా అర్థం చేసుకునే అబ్బాయి జీవితంలోకి వస్తాడు,
5.మే..
మేలో పుట్టిన అమ్మాయిలు ప్రేమ జీవితానికి చాలా ఎక్కువ విలువ ఇస్తారు. వీరికి.. ఉద్యోగ, వ్యాపారంలో స్థిరంగా ఉన్న, నమ్మకమైన పట్టుదల గల అబ్బాయి భర్తగా వస్తాడు.
6.జూన్...
జూన్ లో పుట్టిన అమ్మాయిలకు తెలివితేటలు చాలా ఎక్కువ. వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ. కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారు. వీరికి హాస్య స్వభావం ఉన్న, మాటలతో అందరి మనసులు గెలుచుకునే అబ్బాయి జీవితంలోకి వస్తాడు.
7.జులై...
జులైలో పుట్టిన అమ్మాయిలు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి కుటుంబం పట్ల బాధ్యత చాలా ఎక్కువ. ఇలాంటి అమ్మాయిలకు జీవితంలో ప్రతి విషయంలోనూ తోడు నీడలా ఉండే, నమ్మకమైన అబ్బాయి జీవితంలోకి వస్తాడు.
8.ఆగస్టు...
ఆగస్టులో పుట్టిన అమ్మాయిలకు ఆత్మ విశ్వాసం ఎక్కువ. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి, వీరు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అలాంటి ఈ అమ్మాయిలకు సమాజంలో భార్యకు గౌరవం ఇచ్చే వ్యక్తిత్వం, ఎలాంటి ఈగో లేకుకండా ప్రశాంతంగా ఉండే అబ్బాయి భర్తగా ఇస్తాడు.
9.సెప్టెంబర్...
సెప్టెంబర్ లో పుట్టిన అమ్మాయిలు చాలా శాంత స్వభావం కలిగి ఉంటారు. చాలా క్రమశిక్షణతో కూడా ఉంటారు. అలాంటి అమ్మాయిలకు జీవితంలో సరిగా ఆలోచించే, బాధ్యతగల, వాగ్ధానాలు నిలబెట్టుకునే అబ్బాయి భర్తగా వస్తాడు.
10.అక్టోబర్...
అక్టోబర్ లో పుట్టిన అమ్మాయిలు ఎక్కువ మంది స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. జీవితాన్ని చాలా ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఇలాంటి అమ్మాయిలకు రొమాంటిక్ గా, తమను ఎక్కువగా కేర్ చేసే అబ్బాయి జీవితంలోకి వస్తాడు.
11.నవంబర్...
నవంబర్ లో పుట్టిన అమ్మాయిలు మంచి ఆలోచనాపరులు. వీరు ప్రైవసీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నమ్మిన వారిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే, వీరికి ఓర్పు ఎక్కువగా ఉన్న, నిజాయితీగా ఉన్న, ఇతరుల భావాలను గౌరవించే అబ్బాయి జీవితంలోకి వస్తాడు.
12.డిసెంబర్...
డిసెంబర్ లో పుట్టిన అమ్మాయిలు జీవితంలో స్వేచ్ఛను కోరుకుంటారు. వీరికి కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. వీరికి.. సాహసవంతమైన, ప్రయాణాలు ఇష్టపడే, ఫ్రీ మైండ్ ఉన్న అబ్బాయి జీవితంలోకి వస్తాడు.

