Mercury Transit: వృశ్చికంలోకి బుధుడు.. ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం
Mercury Transit డిసెంబర్ 6, 2025న బుధుడు రాశిని మార్చుకుని వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ బుధ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్ధికంగా కలిసి వస్తుంది. అప్పులన్నీ తీరిపోయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

బుధ సంచారం 2025
జ్యోతిషశాస్త్రంలో బుధుడు ఎంతో ముఖ్యమైన గ్రహం. అతని సంచారం 12 రాశులపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. బుధుడు తెలివి, మాట, వ్యాపారానికి కారకుడు. డిసెంబర్ 6, 2025న తులారాశి నుంచి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. ఆ రాశులు ఏవో… మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
వృశ్చిక రాశి
బుధుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోని లగ్నంలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సొసైటీలో ఈ రాశుల వారికి గౌరవం పెరుగుతుంది. ఏ పనీ చేపట్టినా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారిలో పదవ ఇంట్లోకి బుధుడు మారబోతున్నాడు. అంటే వృత్తి స్థానంలోకి వెళ్తాడు. దీనివల్ల ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. వీరి ఆదాయ మార్గాలు కూడా పెరిగి లాభాలు వస్తాయి. అలాగే వ్యక్తిగతంగా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారికి ఇది కొత్త ఉద్యోగం దొరికే సమయం ఇది.
మకర రాశి
బుధ గ్రహం మకర రాశి వారి 11వ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. 11వ ఇల్లు అనేది లాభాలను తెచ్చిన స్థానం. బుధ సంచారం అనేది మకర రాశికి అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి వ్యాపారం, ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వీరి ఆర్ధిక పరిస్థితి కూడా పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది.

