జోతిష్యశాస్త్రం ప్రకారం.... ఈ రాశివారికి ఉన్న ఫోబియా ఏంటో తెలుసా..?
కొందరికీ చీకటి అంటే భయం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో ఫోబియా ఉంటుంది. అయితే.. మరి జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి ఫోబియా ఉంటుందో ఓసారి చూద్దాం..

కొందరికి నీళ్లంటే భయం, కొందరికీ చీకటి అంటే భయం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో ఫోబియా ఉంటుంది. అయితే.. మరి జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి ఫోబియా ఉంటుందో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
కకోర్హాఫియోఫోబియా.. మేష రాశివారికి ఈ ఫోబియా చాలా ఎక్కువ. దీని అర్థం.. జీవితంలో ఏ విషయంలో నైనా ఓడిపోతామేమో అనే భయం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.
2.వృషభ రాశి..
మెటాథెసియోఫోబియా.. వృషభ రాశివారికి ఈ ఫోబియా చాలా ఎక్కువ. దీని అర్థం ఏంటంటే.. వీరు మార్పుకు భయపడతారు. ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లినా వీరు భయపడతారు. వీరు ఎప్పుడూ తమ కంఫర్ట్ జోన్ లో ఉండాలని అనుకుంటారు. ప్రయత్నాలు చేయడానికి వీరికి చాలా భయం.
3.మిథున రాశి..
గామోఫోబియా... మిథున రాశివారికి ఈ రకం ఫోబియా చాలా ఎక్కువ.ఈ రాశివారికి తమ రిలేషన్ లో కమిట్మెంట్ ఇవ్వాలంటే ఎక్కువగా బయటపడతారు. వీరికి కేవలం రిలేషన్స్ మాత్రమే కాదు.. కెరీర్ విషయంలోనూ వీరికి భయం చాలా ఎక్కువ.
4.కర్కాటక రాశి..
అగోరాఫోబియా... కర్కాటక రాశివారికి ఈ రకం ఫోబియా చాలా ఎక్కువ. అంటే.. ఈ రాశి వారికి ఎక్కువ మంది జనం ఉన్న ప్రదేశాలు లేదంటే,.... ఏదైనా ఓపెన్ ప్లేసెస్ కి వెళ్లాలన్నా.. చూడాలన్నా కూడా వీరికి భయం.
5.సింహ రాశి..
అథాజాగోరాఫోబియా.. సింహ రాశివారికి ఈ రకం ఫోబియా చాలా ఎక్కువ. ఈ రాశివారికి నిశ్శబద్దం అంటే చాలా భయం. వీరికి కామ్ గా ఉంటం.. లేదా.. ఎవరైనా కామ్ గా ఉన్నా వీరికి భయమే. ఈ విషయం వీరిని విపరీతంగా భయపెట్టేస్తుంది.
6.కన్య రాశి..
అట్లీఫోబియా... కన్య రాశివారికి ఈ ఫోబియా చాలా ఎక్కువ. వీరికి ఇంపర్ఫెక్ట్ గా ఉండటం అంటే చాలా భయం. ఈ విషయం వీరిని చాలా ఎక్కువగా బయటపెడుతుందట.
7.తుల రాశి..
మోనోఫోబియా... తుల రాశివారికి ఈ రకం ఫోబియా చాలా ఎక్కువ. అంటే.. వీరికి ఒంటరిగా ఉండటం అనే విషయం ఎక్కువగా భయపెడుతుంది. బయట ఎక్కడో కాదు.. కేవలం ఇంట్లో కూడా వీరు ఒంటరిగా ఉండాలన్నా భయపడిపోతారు.
8.వృశ్చిక రాశి..
ప్రొడిటియోఫోబియా... వృశ్చిక రాశివారికి ఈ రకం ఫోబియా చాలా ఎక్కువ. అంటే.. ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. అందుకే.. ఈ రాశివారికి మోసం అంటే భయం. ఎవరైనా తమను మోసం చేస్తారేమో అని వీరికి భయం ఎక్కువ.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి తప్పిపోతామేమో అనే భయం చాలా ఎక్కువ. ఏదైనా పార్టీకి వెళ్లినా.. లేదంటే.. ఏదైనా ఈవెంట్స్ లాంటి వాటికి వెళ్లినా తప్పిపోతామేమో అని వీరు భయపడిపోతారు.
10.మకర రాశి..
మకర రాశివారికి కూడా మేష రాశివారికి లాగానే.. ఏదైనా విషయంలో ఓడిపోతాం అనే భయం వీరికి చాలా ఎక్కువ. అంతేకాదు.. ఇచ్చిన మాటను ఎవరైనా చేయకపోయినా వీరికి చాలా భయం.
11.కుంభ రాశి..
మైసోఫోబియా... ఈ రాశివారికి .. క్రిములు, జెమ్స్ లాంటివి అంటే భయం చాలా ఎక్కువ. ఈ భయంతో వీరు తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజ్ రాసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు..
12.మీన రాశి..
హైపెన్జోఫోబియా.. మీన రాశివారికి ఈ రకం ఫోబియా ఎక్కువ. అంటే.. వీరికి బాధ్యతలు అంటే భయం. బాధ్యతలు ఉన్నాయంటే..వీరు పారిపోతూ ఉంటారు. ఏ బాధ్యతను కూడా తీసుకోలేరు.