- Home
- Astrology
- పిల్లలతో కఠినంగా ఉంటారా? అతి ప్రేమగానా? మీరెలాంటి తల్లిదండ్రులు? మీ రాశి ఏం చెబుతోంది...?
పిల్లలతో కఠినంగా ఉంటారా? అతి ప్రేమగానా? మీరెలాంటి తల్లిదండ్రులు? మీ రాశి ఏం చెబుతోంది...?
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా ఉంటారు. మరికొందరు డిక్టేటర్ లా వ్యవహరిస్తారు. ఇంకొందరు పట్టింకోనట్టే ఉండి పట్టించుకుంటారు. అదంతా రాశిచక్రం ప్రకారమే ఉంటుందట.

Representative Image: Aries
మేషరాశి : ఈ రాశివారు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే బాధ్యతలనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. లేదా చాలా కూల్ పేరెంట్ గా ఉంటారు.
Representative Image: Taurus
వృషభరాశి : ఈ రాశి తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. తమ పిల్లలు కూడా చక్కగా మర్యాదగా ఉండాలని.. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటారు.
మిధునరాశి : వీరెప్పుడూ నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. పిల్లలనుంచైనా సరే. వారితో సరదాగా ఉంటారు. పిల్లలకు మంచి విద్య అందించాలనేదే వీరి ఫోకస్.
కర్కాటకరాశి : పిల్లలకు ప్రేమపూరిత, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఏం కావాలో, ఏం చేయాలో సాధ్యమైనంత వరకు చేస్తారు.
Leo Zodiac
సింహరాశి : చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరికి పేరెంట్ హుడ్ చాలా ఇష్టం. పిల్లలతో సరదాగా, సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు.
Virgo
కన్యారాశి : వీరు కాస్త కఠినంగానే ఉంటారని చెప్పాలి. తమ పిల్లలు అన్నింట్లోనూ పర్ ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటారు.
Libra
తులారాశి : వీరికి శాంతం ఎక్కువ. ఎలాంటి పరిస్థితినైనా శాంతించేలా చేస్తారు. పిల్లలతో ఎలాంటి వాదనలు వచ్చినా.. ఎలా కూల్ చేయాలో వీరికి బాగా తెలుసు.
వృశ్చికరాశి : ఈ రాశి తల్లిదండ్రులు పిల్లలు ఏం నమ్ముతున్నారో దానికోసం నిలబడేలా సహాయపడతారు. పిల్లలు శక్తివంతంగా, ధైర్యంగా ఎదగడానికి.. జీవితంలో ఎదురయ్యే కష్టసమయాల్ని ఎదుర్కునే విధంగా ఎదిగేలా చేస్తారు.
ధనుస్సురాశి : తమ పిల్లలు ప్రపంచాన్ని తెలుసుకోవడానికి సహాయపడతారు. వారు ఏదైనా ఎక్స్ ప్లోర్ చేసేలా ప్రోత్సహిస్తారు. ఆ క్రమంలో అద్బుతాలు జరుగుతాయి.
మకరరాశి : మీది మకరరాశి అయితే.. పిల్లలతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కువగా ప్రయోగాలు చేయకపోవడమే మంచిది.
కుంభరాశి : వీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు. తమ పిల్లల్ని స్వతంత్రంగా, కాన్ఫిడెంట్ గా ఉండేలా పెంచడంతో వీరిది అందెవేసిన చేయి.
Pisces Zodiac
మీనరాశి : మీనరాశి వారు తల్లిదండ్రులుగానే కాదు.. సహజంగానే ప్రతీవారి పట్ల కేరింగ్ గా ఉంటారు. కాబట్టి ఇక తల్లిదండ్రులుగా వీరు చాలా ప్రేమగా ఉంటారని చెప్పడంలో సందేహమే లేదు.