Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తర్వాత ఎలా మారిపోతారో తెలుసా?
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. వీరు జీవితంలో మంచి లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. క్రమశిక్షణ ఎక్కువ. నాయకత్వ లక్షణాలు కూడా మెండుగా ఉంటాయి.

birth date
జోతిష్యం మాదిరిగానే.. న్యూమరాలజీ కూడా మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. న్యూమరాలజీ ఆధారంగా.. మనం ఒక మనిషి గడిచిన కాలం, వారి ప్రవర్తన, భవిష్యత్తు గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా వివాహం తర్వాత వారి జీవితం ఎలా మారుతుంది..? తమ భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలను కూడా న్యూమరాలజీ తెలియజేస్తుంది. నెంబర్ 1 కి చెందిన వ్యక్తులు పెళ్లి తర్వాత ఎలా మారతారు..? తమ జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. వీరు జీవితంలో మంచి లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. క్రమశిక్షణ ఎక్కువ. నాయకత్వ లక్షణాలు కూడా మెండుగా ఉంటాయి.
లైఫ్ పార్ట్నర్ తో ఎలా ఉంటారు..?
నెంబర్ 1 కి చెందిన వ్యక్తులు సహజంగా నమ్మకంగా, స్వతంత్రంగా ఉంటారు. వారు జీవితంలో తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరిపైనా ఆధారపడటానికి ఇష్టపడరు. పెళ్లి తరవాత కూడా ఇదే ప్రవర్తనను కొనసాగిస్తారు. తమ లైఫ్ పార్ట్నర్ దగ్గర కూడా తమ అహంకారాన్ని చూపిస్తూ ఉంటారు. తమ ఆధిపత్యాన్ని చూపించాలని అనుకుంటారు. వారు ఏది చెబితే అదే జరగాలని అనుకుంటారు. వీరి ప్రవర్తన కారణంగా.. దంపతుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
భాగస్వామికి మద్దతుగా....
ఈ తేదీల్లో జన్మించిన వారు జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు. వారు తమ కెరీర్, వ్యక్తిగత వృద్ధి గురించి చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఎల్లప్పుడూ కొత్త అవకాశాల కోసం చూస్తుంటారు. జీవిత భాగస్వామిగా, వారు తమ భాగస్వామిని వారి కలలను నెరవేర్చుకోవడానికి మంచి ఛాన్స్ ఇస్తారు. తమ భాగస్వామి లక్ష్యాలకు మంచి సపోర్ట్ గా నిలుస్తారు.
అహంకారం ఎక్కువ..
అయితే.. ఈ తేదీల్లో జన్మించినవారు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు. మంచి సపోర్టివ్ భాగస్వామి లా కనిపిస్తూనే.. ఒక్కోసారి ఆంక్షలు విధిస్తారు. ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తారు. అన్నీ తాము చెప్పినట్లు జరగాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. తాము చెప్పిందే కరెక్ట్ అనే భావన వీరిలో ఉంటుంది. ఎవరు ఏది చెప్పినా వినరు. దీని వల్ల తమ భాగస్వామితో ఎక్కువగా గొడవలు జరుగుతాయి.
దాంపత్య జీవితం బాగుండాలంటే...
ఈ తేదీల్లో జన్మించిన వారు తమ భాగస్వామితో సంతోషంగా ఉండాలి అంటే.. కొంచెం నిజాయితీగా ఉండాలి. వారి భాగస్వామి వారి స్వాతంత్ర్యం, ఆశయాలను కూడా గౌరవించాలి. అలాగే, వారి భావాలను, అవసరాలను స్పష్టంగా వ్యక్తపరచాలి. దంపతులు ఇద్దరూ తాము సమానం అనే వీరు తెలుసుకోవాలి.