మీ రాశిని బట్టి.. మీరు ఎలాంటి బాయ్ ఫ్రెండ్..?
మీ రాశి చక్రాన్ని బట్టి.. మీ వ్యక్తిత్వం చెప్పేయవచ్చట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు ఎలాంటి బాయ్ ఫ్రెండో ఇప్పుడు చూద్దాం...

astrology
జోతిష్యశాస్త్రాన్ని పూర్తిగా నమ్మేవారు కొందరు ఉంటారు. అసలు నమ్మనివారు కూడా ఉంటారు. నమ్మేవారి విషయానికి వస్తే.. మీ రాశి చక్రాన్ని బట్టి.. మీ వ్యక్తిత్వం చెప్పేయవచ్చట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు ఎలాంటి బాయ్ ఫ్రెండో ఇప్పుడు చూద్దాం...
1.మేష రాశి..
ఈ రాశి అబ్బాయిలు.. తమ ప్రేమయసి తో చాలా నిజాయితీగా ఉంటారు. ఈ రాశివారిది చాలా ఓపెన్ మైండెడ్. అయితే.. వీరికి ఓపిక చాలా తక్కువగా ఉంటుందట. వెంటనే కోపం వచ్చేస్తుంది.
2.వృషభ రాశి..
ఈ రాశి అబ్బాయిలు.. తమ పార్ట్ నర్ పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు. అంతేకాదు.. ప్రతి విషయంలో.. చాలా సపోర్టివ్ గా ఉంటారు. తమ పార్ట్ నర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. అండగా నిలుస్తారు. అయితే.. వీరికి కొంచెం మొండి పట్టుదల ఎక్కువ. దానిని మాత్రం కాస్త తట్టుకోవడం కష్టం.
3. మిథున రాశి..
ఈ రాశివారు తమ పార్ట్ నర్ కి పూర్తిగా సపోర్టివ్ గా ఉంటారు. ప్రతి నిమిషం నవ్వించాలని చూస్తారు. ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తారు. అయితే.. అప్పుడప్పుడు మాత్రం చిన్న చిన్న అబద్దాలు చెబుతుంటారు.
4.కర్కాటక రాశి..
ఈ రాశి అబ్బాయిలు.. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరికి.. తమ గర్ల్ ఫ్రెండ్ కి లేఖలు రాయడం.. బహుతులు ఇవ్వడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు. తమ ప్రేయసి కూడా వండి పెట్టడం కూడా వీరికి బాగా ఇష్టం.
5.సింహ రాశి..
ఈ రాశి అబ్బాయిలు.. చాలా పాజినేట్ గా ఉంటారు. అంతేకాదు.. చాలా డెడికేటింగ్ గా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అయితే.. ప్రేయసి విషయంలో మాత్రం కొంచెం పొసెసివ్ నెస్ ఎక్కువ. వేరే ఎవరితో మాట్లాడినా తట్టుకోలేరు.
6.కన్య రాశి..
ఈ రాశి అబ్బాయిలు అన్ని విషయాల్లో చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఈ రాశి అబ్బాయిలు ఎలాంటి పిచ్చి వేషయాలు వేయరు. చాలా నిజాయితీగా ఉంటారు. అయితే.. తమ పార్ట్ నర్ మనస్తత్వం మార్చాడనికి ప్రయత్నిస్తూ ఉంటారు.
7.తుల రాశి..
ఈ రాశి అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అయితే.. వీరు ఏ విషయంలోనూ నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. ప్రతి విషయానికి పార్ట్ నర్ పై ఆధారపడుతూ ఉంటారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశి అబ్బాయిలు.. చాలా డెడికేటింగ్ ఉంటారు. అయితే.. వీరిలో కొంత జెలస్ ఎక్కువగా ఉంటుంది. అదే.. వీరిలో పెద్ద వీక్ నెస్ అని చెప్పొచ్చు.
9.ధనస్సు రాశి..
ఈ రాశి అబ్బాయిలు చాలా ఆశావాదులు. ఈ రాశివారు.. చాలా స్పాంటేనియస్ గా మాట్లాడతారు.. ఆ మాటలతోనే తమ పార్ట్ నర్ ని ఇంప్రెస్ చేస్తుంటారు. ఇదే వారిలో ప్లస్ పాయింట్.
10.మకర రాశి..
ఈ రాశి అబ్బాయిలు చాలా కేరింగ్ గా.. మద్దతుగా ఉంటారు. అయితే.. వీరికి పని పిచ్చి ఎక్కువ. పని ఎక్కువగా చేయడం.. మీ పార్ట్ నర్ కి నచ్చకపోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
11.కుంభ రాశి..
ఈ రాశి అబ్బాయిలు కొంచెం మొండిగా ుంటారు. ఈ విషయం.. తమ పార్ట్ నర్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ.. వీరు చాలా కేరింగ్ గా.. ప్రేమను చూపిస్తూ.. చాలా పాంపర్ చేస్తారు.
12.మీన రాశి..
ఈ రాశి అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. తమ పార్ట్ నర్ పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు. అయితే.. కేవలం తమ పార్ట్ నర్ తో మాత్రం మంచిగా ఉంటారు. మిగితా వారితో.. అంత మంచిగా ఉండకపోవచ్చు.