ఈ రాశివారు తమకు వచ్చిన బహుమతులను ఏం చేస్తారో తెలుసా?
కొందరు వాటిని దాచిపెట్టి.. వేరే వారికి అదే బహుమతిగా ఇస్తూ ఉంటారు. అయితే... తమకు వచ్చిన బహుమతులను ఏ రాశివారు ఏం చేస్తారో చూద్దాం..

పండగళ వేళ ఒకరికి మరొకరు బహుమతులు ఇచ్చుుకోవడం చాలా కామన్ గా జరిగే విషయమే. కొందరు తమకు వచ్చిన బహుమతులను అపురూపంగా చూసుకుంటారు. కానీ.. కొందరు వాటిని దాచిపెట్టి.. వేరే వారికి అదే బహుమతిగా ఇస్తూ ఉంటారు. అయితే... తమకు వచ్చిన బహుమతులను ఏ రాశివారు ఏం చేస్తారో చూద్దాం..
1.మేష రాశి..
ఈ రాశివారు తమకు వచ్చిన బహుమతులను అంత తొందరగా ఇతరులకు ఇవ్వరు. కానీ... తప్పని పరిస్థితి ఏర్పడితే మాత్రం... ఇతరులకు తమకు వచ్చిన బహుమతులు ఇచ్చేస్తారు. తమ దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేనప్పుడు అలా చేసి తప్పించుకుంటారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు తమకు వచ్చిన గిఫ్ట్స్ ని ఇతరులకు అస్సలు ఇవ్వరు. అవి తమకు అవసరం లేకపోయినా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కాకపోతే... వచ్చే ఏడాది అవసరమైతే అప్పుడు ఉపయోగించుకుంటారు. కానీ.. అస్సలు వేరే వాళ్లకు ఇవ్వరు.
3.మిథున రాశి..
మిథున రాశివారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఈ రాశివారు తమకు కావాల్సింది దొరకనప్పుడు.. దానితో మనకు పనిలేదు అని భావిస్తారు. అంతే.. మనకు పనికిరానిది ఎందుకు అని వేరే వారికి బహుమతిగా ఇస్తారు. అలా చేసినందుకు వారు కొంచెం కూడా ఫీల్ అవ్వరు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఇతరులు ఇచ్చే బహుమతులకు చాలా విలువ ఇస్తారు. వాటిని ఇతరులతో పంచుకోవడానికి వారు పెద్దగా ఇష్టపడరు. ఏ గిఫ్ట్ అయినా రాని.... వాటిని తమతోనే ఉంచుకుంటారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు పండగకు తమకు కావాల్సింది ఏలాగైనా సాధిస్తారు. తమకు కావాల్సింది తీసుకొని.. తమకు అవసరం లేనిది మాత్రం.. ఇతరులకు ఇచ్చేస్తారు.
6.కన్య రాశి..
కన్య రాశి ఎవరైనా సరే... తమకు ఇచ్చిన బహుమతిని మరొకరికి ఇవ్వడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. అది చాలా పెద్ద తప్పు అని వారు భావిస్తారు. బహుమతికి వారు విలువ ఎక్కువగా ఇస్తారు.
7.తుల రాశి...
తుల రాశివారు బహుమతిని ఓ మధుర గ్నాపకంగా చూస్తుంటారు. అయితే... వారు ఎవరికైనా బహుమతిగా ఇవ్వాల్సి వస్తే... సింపుల్ గా ఇచ్చి తప్పించుకుంటారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు బహుమతులను గొప్ప ట్రెజర్ లాగా భావిస్తారు. వాటిని వెంటనే ఉపయోగించకపోయినా... తర్వాత చిన్నగా ఉపయోగించుకుంటారు. అయితే... వీరు ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా ఉంటుందట.
9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు ఏదీ నిల్వ ఉంచుకోరు. బహుమతి ఏదైనా తమకు ఉపయోగకరం అయితేనే ఉంచుకుంటారు. అవసరం లేకపోతే... వేరే ఎవరికైనా ఇచ్చేస్తారు.
10.మకర రాశి..
ఈ రాశివారికి బహుమతులు అంటే ఇష్టం. ఏ బహుమతి అయినా చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అది ఏ బహుమతి అయినా ఇంట్లో అలంకరించుకుంటారు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి ఇతరులకు బహుమతులు ఇవ్వడం అంటే కూడా చాలా ఇష్టం. అయితే... తమ స్నేహితులు, బంధువులకు మాత్రమే ఇష్తారు. వారు ఇచ్చే బహుమతులను కూడా అంతే భద్రంగా దాచుకుంటారు. నచ్చనివారు ఇచ్చేవి మాత్రమే ఇతరులకు ఇచ్చేస్తారు.
12.మీన రాశి..
మీన రాశివారు తమకు వచ్చిన బహుమతులను అవసరమైతే ఎవరికైనా ఇచ్చేస్తారు. తమకు అది అవసరంలేదు అని భావిస్తే చాలు.. వెంటనే వేరే వారికి ఇచ్చేస్తారు.