MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ వారం ఓ రాశివారికి అప్పులు తీరుతాయి.. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు!

ఈ వారం ఓ రాశివారికి అప్పులు తీరుతాయి.. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు!

ఈ వార ఫలాలు 07.09.2025 నుంచి 13.09.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Sep 07 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలం. స్థిరాస్తి వివాదాలు సర్దుమణుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. అప్పులు తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో కోరుకున్న ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. 

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో చిన్నపాటి కలహా సూచనలు ఉన్నాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆప్తులతో సరదాగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. నిరుద్యోగులు చాలా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో బంధువుల సలహాలు తీసుకొని ముందుకు సాగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు.  

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

బంధుమిత్రులతో వివాదాలు తొలగి ఊరట పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇతరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువను పెంచుకుంటారు. స్థిరాస్తి లాభాలు పొందుతారు. విద్యార్థుల ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో తోటివారితో మాట పట్టింపులు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఊహించని వివాదాలు కలుగుతాయి.  

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారంలో సోదరులతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. అప్పులు తీరుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి బయటపడతారు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు అందుతాయి. 

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. స్నేహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటాబయటా మీ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. 

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.  

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. రావాల్సిన డబ్బు అవసరానికి చేతికందుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ టైంకి పూర్తిచేస్తారు. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు వాయిదా పడతాయి. కుటుంబ ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభ సూచనలు ఉన్నాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
ఈ తేదీల్లో పుట్టినవారికి సెప్టెంబర్ నెల సూపర్ గా కలిసివస్తుంది!
Recommended image2
ఈ 5 రాశులవారు చాలా అదృష్టవంతులు.. వీరికి డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved