MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఈ 3 రాశులవారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఈ 3 రాశులవారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 31.5.2026 నుంచి 6.6.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

4 Min read
Author : Kavitha G
Published : May 31 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Asianet News

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి శుభసూచనలు ఉన్నాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు రావచ్చు. కుటుంబ జీవితంలో పెద్దల సలహాలు కలిసివస్తాయి. దాంపత్య జీవితంలో గతంలో ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఈ వారం స్థిరత్వం, పురోగతి ఉంటాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. పదోన్నతి లేదా జీతం పెంపు విషయాల్లో సానుకూల సంకేతాలు ఉన్నాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలం. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. విదేశీ విద్య అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారు ఈ వారం చాలా చురుకుగా ఉంటారు. ఆలోచనా శక్తి, సంభాషణా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకం. వ్యాపారాలలో స్పష్టత అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి అనుకూల సమయం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఈ వారం కర్కాటక రాశివారిని భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో కొంత ఒత్తిడి కనిపించినా, మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాలలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. విద్యార్థులకు సృజనాత్మకత పెరిగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ వారం ప్రణాళికలు సఫలమయ్యే అవకాశం ఉంది. తెలివితేటలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టవచ్చు. వ్యాపారాలలో కొన్ని ఒప్పందాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. స్నేహితుల నుంచి మద్ధతు లభిస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. విద్యార్థులకు ఇది అనుకూల సమయం. పరిశోధన, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఈ వారం తుల రాశివారికి అనుకూలం. వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడి, కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక విషయాల్లో ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలం. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మీ కృషిని అధికారులు గుర్తించే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు లాభదాయకంగా మారవచ్చు. కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఉండవచ్చు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మాటలపై నియంత్రణ అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభాలు వచ్చినా అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఉన్నవారికి పదోన్నతి లేదా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో కొత్త పరిచయాలు లాభాలు తీసుకువస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి వివాహ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్యలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. దీర్ఘకాల పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారు ఈ వారం క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి. పనుల్లో ఆలస్యం జరిగినా చివరకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. దాంపత్య జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా, భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఈ వారం కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతాయి. ఉద్యోగాలలో వినూత్న ఆలోచనలతో గుర్తింపు పొందుతారు. ఐటీ, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఇది అనుకూల సమయం. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారిని ఈ వారం ఆధ్యాత్మికత, భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ సంబంధాల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Saraswati Rajayogam: మిథున రాశిలో అరుదైన రాజయోగం.. ఈ 6 రాశులవారి పంట పండినట్లే!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారికి 30 ఏళ్లు దాటాక రాజయోగం.. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved