MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!

ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 21.09.2025 నుంచి 27.09.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Sep 21 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. 

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

అనుకున్న పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తవుతాయి. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వనాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు పెరుగుతాయి. 

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు సంబంధించి అవరోధాలు అధిగమిస్తారు. ఇంటా బయటా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. పని ఒత్తిడి అధికమై ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపారాలకు సంబంధించి ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. 

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సకాలంలో ఆప్తుల సహకారం అందుతుంది. సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలం. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. 

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తుచేసుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత వరకు బయటపడతారు. 

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు క్రమంగా లాభాలబాట పడతాయి.  

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఏ పని ప్రారంభించినా అప్రయత్నంగా పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. 

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు ఆచరించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలు పెరుగుతాయి.  

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటా బయటా అందరు మీ మాటతో విభేదిస్తారు. సన్నిహితుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత వరకు బయటపడతారు. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ప్రత్యర్థులు కుడా సానుకూలంగా మారతారు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వారం మధ్యలో ఒక సంఘటనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న పదవులు లభిస్తాయి.  

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. వారం చివరిలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.  

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
ఈ 4 రాశులవారు చాలా డేంజర్.. కుట్రలు చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా!
Recommended image2
ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఇతరుల గురించి అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved