ఈ 4 రాశులవారు చాలా డేంజర్.. కుట్రలు చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా!
జ్యోతిష్యం ప్రకారం రాశి చక్రాల ఆధారంగా వ్యక్తుల స్వభావాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని రాశులవారు మంచి చేయడంలో ముందుంటే.. మరికొందరు కుట్రలు చేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కుట్రలు చేసే రాశులేంటో చూద్దామా..

కుట్రలు చేయడంలో ముందుండే రాశులు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కొందరు చాలా మంచివాళ్లు అయితే, మరికొందరు చెడు ఉద్దేశాలు కలిగి ఉంటారు. కొందరికి సహజంగానే కుట్రలు చేసి గెలిచే మనస్తత్వం ఉంటుంది. వారిని పాలించే గ్రహాలు, రాశులు ఇందుకు కారణం కావచ్చు. మరి ఏ రాశుల వారు కుట్రలు చేయడంలో సిద్ధహస్తులో ఇక్కడ చూద్దాం.
మిథున రాశి
మిథున రాశివారు ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు. వీరిని నమ్మి ఏదైనా రహస్యం చెబితే, దాన్ని మనకు వ్యతిరేకంగానే వాడుకుంటారు. తమ పని వల్ల ఎవరైనా బాధపడతారని వీరు అస్సలు ఆలోచించరు. వీరి పనులు ఎప్పుడూ స్వప్రయోజనం కోసమే ఉంటాయి. కాబట్టి వీరితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రహస్యం చెప్పే ముందు లేదా ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త వహించాలి.
తుల రాశి
తుల రాశివారు తమ తెలివితేటలతో గొడవలు లేకుండా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇతరులను సులభంగా నమ్మించి, తమకు అనుకూలంగా ఒప్పించగలరు. ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించినా, అది వారికే తెలియకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు. సయోధ్య పేరుతో రెండు వైపులా మాట్లాడి తమకు అనుకూల వాతావరణం సృష్టించుకుంటారు. వీరు అమాయకంగా కనిపించినా.. కుట్ర చేసి అనుకున్నది సాధిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఇతరుల తప్పులు వెతకడంలో ముందుంటారు. ఏదైనా మాట అంటే కోపగించుకుంటారు. తర్వాత అదే మాటను మనకు వ్యతిరేకంగా వాడే తెలివి వీరికి ఉంటుంది. కుటుంబంలో, పనిలో కుట్రలు చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరికి ఇతరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కువ. అందుకే ఇతరుల బలాలు, బలహీనతలను త్వరగా గుర్తిస్తారు. తమ లక్ష్యాల కోసం ఇతరులను ప్రభావితం చేస్తారు.
మకర రాశి
మకర రాశి వారు ఎప్పుడూ క్రమశిక్షణతో, సరిగ్గా ఉండాలని అనుకుంటారు. ఇతరుల మాటలను జాగ్రత్తగా గమనించి, వాటినే వారికి వ్యతిరేకంగా తిప్పగల నైపుణ్యం కలిగి ఉంటారు. ఒకరిని తమకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటే ఎన్నో ఎత్తులు వేస్తారు. ఏ పరిస్థితిలోనూ భావోద్వేగానికి గురికాకుండా తమకు కావాల్సింది సాధించుకుంటారు. తమ మాటతీరుతో ఒకరి మనసును ఈజీగా మార్చగలరు.
గమనిక
ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిష్య అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా అందించింది మాత్రమే. దీన్ని ఏషియానెట్ న్యూస్ తెలుగు ధృవీకరించలేదు.