- Home
- Astrology
- Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. అనుకూలంగా డబ్బు వ్యవహారాలు!
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. అనుకూలంగా డబ్బు వ్యవహారాలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 01.11.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది.
వృషభ రాశి ఫలాలు
మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి.
మిథున రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా కొత్త సమస్యలు వస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమవుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల నష్టాలు వస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహ రాశి ఫలాలు
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుంచి పెట్టుబడి సహాయం అందుతుంది.
కన్య రాశి ఫలాలు
డబ్బు వ్యవహారాలు కలసివస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపార భాగస్వాములతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటు వల్ల సకాలంలో పూర్తికావు. వృత్తి, ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుంచి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
ధనుస్సు రాశి ఫలాలు
ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుంచి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మకర రాశి ఫలాలు
ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.
కుంభ రాశి ఫలాలు
ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మీన రాశి ఫలాలు
కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమతో కానీ పనులు పూర్తికావు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు. బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.





