వార ఫలాలు: ఓ రాశి వారికి గృహము నందు శుభకార్యాలు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం సమాజము నందు మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారములను చక్కబెట్టుకుంటారు. మానసిక ప్రశాంతత పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. విద్యార్థులకు అనుకూలం.
వార ఫలాలు :16 జూలై 2023 నుంచి 22 జూలై 2023 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
చతుర్దాధిపతి అయిన చంద్రుడు తృతీయ చతుర్ధ పంచమ స్థానము నందు సంచారం. ఈ సంచారము వలన గృహము నందు శుభకార్యాలు.సంఘం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ధన కనక వస్తు వాహన ప్రాప్తి.
వృత్తి వ్యాపారాల యందు ధన లాభం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.అనుకోని ప్రయాణాలు. గృహ,భూ క్రయ విక్రయాల నందు లాభం.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. సమాజము నందు మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారములను చక్కబెట్టుకుంటారు. మానసిక ప్రశాంతత పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. విద్యార్థులకు అనుకూలం.
అశ్విని నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.22-7-23 శనివారం
భరణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-17-7-23 సోమవారము.19-7-23 బుధవారము20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
కృత్తిక నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
22-7-23 శనివారం
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
తృతీయాధిపతిఅయిన చంద్రుడు:-ద్వితీయ తృతీయ చతుర్ధ స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన తపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు.ఉద్యోగులకు పై అధికారుల తోటి విరోధాలు రావచ్చు .ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. గృహము నందుచికాకులు.శ్రమాధిక్యం.అనుకోని ప్రయాణాలు. బంధు మిత్రులతో కలహాలు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అనవసరమైన ఖర్చులయందు జాగ్రత్త అవసరము. సమాజం నందు అపవాదములు ఏర్పడగలవు. భూ గృహ క్రయవిక్రయాల యందు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
కృత్తిక నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
22-7-23 శనివారం
రోహిణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.22-7-23 శనివారం
మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారం .21-7-23 శుక్రవారం.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర
ద్వితీయాధిపతి అయిన చంద్రుడు:- జన్మ ద్వితీయ తృతీయ స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.సంతాన విషయంలో శుభవార్త వింటారు.మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. తలపెట్టిన పనులు సజావుగా సాగును.ఉద్యోగస్తులకు అధికారుల యొక్క గౌరవం లభించును.చేయు వృత్తి వ్యాపారాల యందు లాభం పొందుతారు .కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ప్రయాణాలు కలిసి వస్తాయి. అప్రయత్నం ధనలాభం పొందగలరు. సమస్యలను ధైర్యంతోటి పరిష్కారిస్తారు. బహుమానాలు సన్మానాలు పొందగలరు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది.
మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారం .21-7-23 శుక్రవారం.
ఆరుద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-.17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.22-7-23 శనివారం
పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
జన్మరాశి అధిపతి అయిన చంద్రుడు:-వ్యయ జన్మ ద్వితీయస్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన ఉద్యోగం నందు పై అధికారుల వలన చికాకులు. జీవిత భాగస్వామితో చికాకులు. స్థానచలనం. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు.ఆదాయానికి మించిన ఖర్చులు. తలపెట్టిన పనులలో ఆటంకాలు.మిత్రులతో కలహాలు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.మనస్సు నందు అనవసరమైన ఆందోళన.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.
అధిక శ్రమ.ఆర్ధిక ఇబ్బందులు. భూ,గృహ క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అకారణంగా కోపం.మనస్సు నందు ఆందోళన.చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.వృత్తి వ్యాపారాలలో స్వల్పలాభాలు.
పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
పుష్యమి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 16-7-23. ఆదివారము.17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.22-7-23 శనివారం
ఆశ్రేష నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-17-7-23 సోమవారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
వ్యయాధిపతి అయిన చంద్రుడు:-లాభ వ్యయ జన్మ స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన తలపెట్టిన పనులలో విజయం సాదిస్తారు. గృహము నందు శుభకార్యాల ప్రస్తావన చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఉద్యోగము
సోదరుల సహాయ సహకారాలు లభించును.వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించును. ఆదాయం మార్గాలు బాగుంటాయి. ఆరోగ్యం అనుకూలించును. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.పాతబాకీలు వసూలు అవుతాయి. శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గృహానికి సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగును.
మఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.
22-7-23 శనివారం
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 17-7-23 సోమవారము.19-7-23 బుధవారము
20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.
19-7-23 బుధవారము.20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.22-7-23 శనివారం
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
లాభాధిపతి అయిన చంద్రుడు:- రాజ్య లాభ స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అగును. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి పొందగలరు.
ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి.
నూతనఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత పెరుగును. పెట్టుబడులకు అనుకూలం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడులకు అనుకూలమైన వారం. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఆదాయం పొందగలరు. సమాజము నందు పలుకుబడితో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.
19-7-23 బుధవారము.20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
22-7-23 శనివారం
హస్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.22-7-23 శనివారం
చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారం .21-7-23 శుక్రవారం.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
రాజ్యాధిపతి అయిన చంద్రుడు భాగ్య రాజ్య లాభ స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతోటి పూర్తి చేయవలెను.
ఉద్యోగము నందు అధికారులతోటి విభేదాలు రావచ్చు.
దైవకార్యాచరణ.భూ సంబందిత క్రయ విక్రయాలలో తగు జాగ్రత్తలు తీసుకొని.మిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడగలవు.స్థానచలనం.ఆదాయానికి మించి ఖర్చులు.ఇతరుల విషయంలో జోక్యం తగదు.కొంత మేర రుణాలు చేయవలసి రావచ్చు.వృత్తి వ్యాపారాలకు సామాన్యం.అనవసరమైన ప్రయాణాలు. శారీరక శ్రమ పెరుగును. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ. అనవసరమైన ఖర్చులు దూరంగా ఉండవలెను.
చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారం .21-7-23 శుక్రవారం.
స్వాతి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-.17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.
20-7-23 గురువారము.22-7-23 శనివారం
విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర
భాగ్యాధిపతి అయిన చంద్రుడు అష్టమ భాగ్య రాజ్యస్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన తలపెట్టిన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆధ్యాత్మిక చింతన.దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడికి తగిన లాభాలుపొందుతారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. కొన్ని సమస్యల వలన మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆకస్మిక కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులతోటి వాగ్వాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. అధికారులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరుగును. సమాజం నందు అవమానం కలగగలదు. వ్యవహారమునందు కఠినంగా వ్యవహరిస్తారు.
సంఘంలో సమయానుకూలంగా వ్యవహరించవలెను.
విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
అనూరాధ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.22-7-23 శనివారం
జ్యేష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 17-7-23 సోమవారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
అష్టమాధిపతి అయిన చంద్రుడు కళాత్ర అష్టమ భాగ్యస్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొంత కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.వృతి వ్యాపారాల అభివృద్ధి.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.బందు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.స్థిరాస్థి క్రయ విక్రయాలలో ధన లాభాలు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగులకు పై అధికారుల ప్రోత్సాహం వలన చేయు పనిలో అభివృధిలోకి వెళతారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు.గృహము నందు శుభకార్యాల ప్రస్తావన.సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
మూల నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.19-7-23 బుధవారము.20-7-23 గురువారము.
22-7-23 శనివారం
పూ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-17-7-23 సోమవారము.19-7-23 బుధవారము
20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.
19-7-23 బుధవారము.20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
22-7-23 శనివారం
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని
కళత్రాధిపతి అయిన చంద్రుడు షష్టమ సప్తమ అష్టమ స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది.మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.విద్యార్ధులు పరీక్షలలోమంచి ఫలితాలు పొందుతారు.సమయానికి తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు. సమాజము నందు పేరుత ప్రతిష్టలు పొందగలరు.వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పులు రావచ్చు.
ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.
19-7-23 బుధవారము.20-7-23 గురువారము.21-7-23 శుక్రవారం.
22-7-23 శనివారం
శ్రవణం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.
20-7-23 గురువారము.22-7-23 శనివారం
ధనిష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారం .21-7-23 శుక్రవారం.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
షష్ఠమాధిపతి అయిన చంద్రుడు పంచము సప్తమ స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలన సంఘంలో అపకీర్తి రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. అనుకోని మానసిక బాధలు పెరుగును. ఇష్టం లేన పనులు కష్టముగా చేయవలసి వస్తుంది.నూతన వస్తు వాహన కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఆదాయానికి మించిన ఖర్చులు.ఆరోగ్య విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.అకారణంగా కోపం.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చును. శారీరక శ్రమ పెరిగి సౌఖ్యం తగ్గును. అనవసరమైన ఖర్చులు పెరగడం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది.
ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.ఉద్యోగులకు పై అధికారులతో చికాకులు.ఇతరుల విషయంలో జోక్యం తగదు.చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.
అధికారులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనిష్ఠ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారం .21-7-23 శుక్రవారం.
శతభిషం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- .17-7-23 సోమవారము.19-7-23 బుధవారము.
20-7-23 గురువారము.22-7-23 శనివారం
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
పంచమాధిపతి అయిన చంద్రుడు చతుర్ధ పంచమ శత్రు స్థానములందు నందు సంచారం. ఈ సంచారము వలనఉద్యోగం నందు అధికారులతోటి అకారణంగా విరోధాలు.చేయు పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. ఆర్ధిక ఇబ్బందులు కొంత చికాకు తెప్పిస్తాయి.మనస్సు నందు అనవసరమైన ఆందోళన. ఏ పని యందు ఆసక్తి లేకపోవుట.గృహ నిర్మాణ ఆలోచనలో స్తబ్దత.బందు మిత్రులతో కలహాలు.ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి.వృతి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. అనుకున్న పనులలో ఆటంకాలు. మానసిక భయాందోళన. వృధా ఖర్చులు పెరుగును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. కుటుంబ సభ్యులతో అకారణ మనస్పర్ధలు రాగలవు. మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం.
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.18-7-23 మంగళవారము.21-7-23 శుక్రవారం.
ఉ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-16-7-23. ఆదివారము.17-7-23 సోమవారము.
19-7-23 బుధవారము.20-7-23 గురువారము.22-7-23 శనివారం
రేవతి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-17-7-23 సోమవారము.18-7-23 మంగళవారము.
21-7-23 శుక్రవారం.