Venus Mercury Conjunction: బుధుడు శుక్రుడి కలయిక వల్ల ఈ 4 రాశులకు కోటీశ్వర యోగం
Venus Mercury Conjunction: నవంబర్ 2025లో, బుధుడు, శుక్రుడు వృశ్చిక రాశిలో కలవడంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ కోటీశ్వర యోగంతో మిథునం, కర్కాటకం, వృశ్చికం, మీనం రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, వృత్తిలో విజయం, సంపద పెరుగుతాయి.

శక్తివంతమైన యోగం
జ్యోతిష్య శాస్త్రంలో బుధ, శుక్ర గ్రహాలు ప్రధానమైనవి. ఈ రెండు గ్రహాల కలయిక చాలా శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది. బుధుడు జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు అధిపతి. ఇక శుక్రుడు సంపద, విలాసం, కళ, ప్రేమకు కారకుడు. ఈ రెండూ కలిస్తే ఎంతో శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. లక్ష్మీ నారాయణ యోగం లాంటి ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఇది కోటీశ్వర యోగాన్ని ఇస్తుంది.
బుధ శుక్ర యోగం
నవంబర్ 2025లో శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో కలుస్తారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అపారమైన సంపదను అందిస్తుంది. నవంబర్ 7 నుంచి ఈ యోగం ఏర్పడుతుంది. ఇది 10 రెట్ల అదృష్టాన్ని అందిస్తుంది. ఈ యోగం వల్ల వ్యాపార విజయం, ఆకస్మిక ధనలాభం, ఆస్తి లాభాలు పెరుగుతాయి. ఈ యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన డబ్బును అందిస్తుంది.
అదృష్టం పొందే రాశులు
ఈ బుధ-శుక్ర కలయికతో నవంబర్లో కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. ఆ నాలుగు రాశుల గురించి ఇక్కడ ఇచ్చాము.
మిథున రాశి: వీరికి వ్యాపారం, స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి 5వ ఇంట్లో శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. వీరికి విద్య ద్వారా డబ్బు పెరుగుతుంది.
వృశ్చిక రాశి: ఈ రాశిలోనే రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఊహించకుండా ధనలాభం కలుగుతుంది.
మీన రాశి: ఈ రాశి వారికి సంపద, విలాసవంతమైన జీవితం దొరుకుతుంది. వీరికి డబ్బుల వర్షం కురుస్తుంది.
ఆ నాలుగు రాశులకు కలిగే లాభాలు
పైన చెప్పిన నాలుగు రాశుల వారికి ఎన్నో రకాలుగా కలిసివస్తుంది. పాత అప్పులు తీరుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం ఉంది. వీరికి మానసిక ఆరోగ్యం, ప్రశాంతత దక్కుతుంది.
ఇలా పూజ చేయండి
శుక్రుడు బలంగా మారేందుకు శుక్రవారం శుక్రుడికి తెల్లని పువ్వులతో పూజ చేయండి. బుధుడిని మొక్కేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. అలాగే "ఓం లక్ష్మీ నారాయణాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించండి. వెండి వస్తువులను దానం చేయండి.