Venus Transit: శుక్ర సంచారం... జనవరిలో ఈ మూడు రాశులకు మహర్దశ, రెట్టింపు ఆదాయం
Venus Transit: కొత్త సంవత్సరంలో శుక్రుడు మకర రాశిలో ఉదయించనున్నాడు. ఇది మూడు రాశుల వారికి అద్భుతంగా కలిసిరానుంది. ముఖ్యంగా సంపద రెట్టింపు కానుంది. వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది.

Venus Transit
వేద జోతిష్య శాస్త్రం ప్రకారం 2026లో గ్రహాల మార్పులు జరగనున్నాయి. సంపద, శ్రేయస్సుకు ప్రసాదించే శుక్ర గ్రహం.. శని పాలించే మకర రాశిలో ఉదయించనున్నాడు. దీని కారణంగా ఈ ప్రభావం మూడు రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది. మూడు రాశులకు అదృష్టం పెరగనుంది. వారి సంపద కూడా రెట్టింపు అవుతుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం....
మకర రాశి....
శుక్రుడు మీ రాశి లగ్న స్థానంలో ఉదయించడం వల్ల మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో మీరు గౌరవం, ప్రతిష్ఠను కూడా పొందుతారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. మీరు మానసిక శాంతి, సానుకూల శక్తిని అనుభవిస్తారు. వైవాహిక జీవితం అద్భుతంగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది.
మిథున రాశి...
శుక్ర గ్రహం ఉదయించడం మిథున రాశి వారికి చాలా మేలు చేయనుంది. వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడు మీ జాతకంలో పదో స్థానంలో ఉంటాడు.ఈ సమయంలో మిథున రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. సంపద రెట్టింపు అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కళలు, సంగీతం, మీడియా ఫ్యాషన్ డిజైన్ రంగాలలో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. వారి కెరీర్‌లు కొత్త దిశను పొందుతాయి, వారి వృత్తి జీవితంలో విజయానికి కొత్త మార్గాలను తెరుస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
తుల రాశి...
శుక్రుడు ఉదయించడం తుల రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశి నాల్గవ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశివారి సంపద రెట్టింపు అవుతుంది. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల నుంచి భారీ లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. విపరీతంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

