Zodiac signs: శుక్రుడి అనుగ్రహం.. ఏప్రిల్ 13 నుంచి ఈ రాశులకు అదృష్టమే..!
Venus Transit: మీన రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టనున్నాడు. ఈ శుక్ర సంచారం మూడు రాశులకు అదృష్టాన్ని తీసుకురానుంది. ఎంతలా అంటే, ఆర్థికంగా కలిసొస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయంగా మారిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరి, చాలా సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు. మరి, ఆ మూడు రాశులేంటో చూసేద్దామా..

Venus Transit: జోతిష్యశాస్త్రంలో శుక్రుడిని చాలా ప్రత్యేకమైన గ్రహంగా భావిస్తారు. ఎందుకంటే.. ఈ గ్రహం అనుగ్రహం కలిగిందంటే ఆ రాశుల వారికి ఇక తిరుగు ఉండదు. ఈ రాశిని సంపద, కీర్తి, ఐశ్వర్యం, వైభవం, సుఖానికి కారకుడిగా పరిగణిస్తారు. ఈ గ్రహం కదిలిక సంపదను మోసుకొస్తుంది. ఇప్పుడు ఈ గ్రహం.. మరో మూడు రాశులకు అదృష్టాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఈ మార్పులు జరగనున్నాయి.ఎందుకంటే శుక్రుడు మీన రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మార్పుతో లాభపడే రాశులేంటో చూద్దాం...
telugu astrology
1.ధనస్సు రాశి..
ధనస్సు రాశిలో పుట్టిన వారికి శుక్ర సంచారం ఎప్పుడూ కలిసొస్తుంది. శుక్రుడు మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని వల్ల ఈ రాశివారికి సంతోషం, సంపద నేరుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 13 తర్వాత ఈ రాశి వారికి బాగా కలిసొస్తుంది.కాబట్టి, ఈ సమయంలో అన్ని సంతోషాలు పొందుతారు. ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. జీవితంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. మనసులో ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఏవైనా పనులు ఆగిపోయినా, అవి ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కూడా గడుపుతారు.
telugu astrology
2.మిథున రాశి..
శుక్రుడు మీన రాశిలోకి అడుగుపెట్టడం వల్ల మిథున రాశి వారికి మేలు జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుంచి మీ కర్మ వైపు కదులుతూ ఉంటాయి. కాబట్టి, ఈ సమయంలో మిథున రాశివారికి కొత్త కొత్త అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి. మీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.ఈ సమయంలో మీ ప్రేమ జీవితం కూడా ఆనందంగా మారుతుంది. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.
telugu astrology
3.కుంభ రాశి..
కుంభ రాశి వాళ్లకి శుక్ర గ్రహ సంచారం శుభప్రదం. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుంచి వేరే చోటికి నేరుగా కదులుతుంది. కాబట్టి ఈ టైంలో మీకు డబ్బు విషయంలో అన్నీ ఓకే అవుతాయి. అంతేకాదు ఆర్థిక పరిస్థితి ముందు కంటే చాలా బాగుంటుంది. బంధుత్వాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వ్యాపారం చేస్తే కొత్త ఒప్పందాలు కుదురుతాయి. దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య సమస్యలు రావు.