Vastu Tips: వాస్తు ప్రకారం ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి!
భార్యాభర్తలు ఒకరితో ఒకరు ప్రేమగా, అన్యోన్యంగా ఉంటేనే ఆ ఇల్లు అందంగా, ఆనందంగా ఉంటుంది. ఆ వాతావరణంలో పెరిగే పిల్లలు కూడా ఆరోగ్యంగా, తెలివిగా పెరుగుతారు. కానీ భార్యాభర్తలు రోజూ గొడవ పడుతుంటే ఇంట్లో చిరాకుగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇక్కడ చూద్దాం.

పెళ్లి చాలా ప్రత్యేకమైంది. ఈ బంధంలో ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటారు. కొందరి పెళ్లి జీవితం సంతోషంగా ఉంటే మరికొందరి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. గొడవలు, కలహాలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ గొడవలు తీవ్రమై ఇద్దరూ విడిపోయే వరకు వెళ్తాయి.
తల్లిదండ్రుల మధ్య రోజూ గొడవలు జరుగుతుంటే పిల్లల మనస్సు బాధపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు వస్తుంటే దానికి కారణం వాస్తు దోషం. కొన్ని నియమాలు పాటించడం ద్వారా వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవెంటో చూసేయండి.

రాతి ఉప్పు
భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైతే రాతి ఉప్పుతో పరిహారం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రాతి ఉప్పును చిన్న చిన్న ప్యాకెట్లలో వేసి ఇంట్లో అన్ని మూలల్లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
దేవుడి విగ్రహం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టడం చాలా మంచిది. అయితే ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. దేవుడి విగ్రహాన్ని ఎప్పుడూ ఎదురెదురుగా పెట్టకూడదు. ఇది కుటుంబంలో కలహాలను మరింత పెంచుతుంది. అలాగే దేవుడి విగ్రహాన్ని ఎప్పుడూ ఇంటి ముందు వైపు చూసేలా పెట్టడం మంచిది. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
ప్రధాన ద్వారం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దీని ద్వారానే సానుకూల శక్తి, వ్యతిరేక శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీరు ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచకపోతే ఇంట్లో వ్యతిరేక శక్తి వ్యాపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇది కాకుండా ఇంటికి ఈశాన్య మూలను కూడా శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.