Vastu tips: వాస్తు ప్రకారం ఈ 3 చెట్లు ఇంట్లో ఉంటే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి!
మనిషి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఈ శాస్త్రాన్ని కరెక్టుగా ఫాలో అయితే అపజయాలే ఉండవని చాలామంది నమ్ముతారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్నిరకాల మొక్కలు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదట. అవెంటో తెలుసుకోండి

వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఈ శాస్త్రం ప్రకారమే అన్ని పనులు చేస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం చేస్తే అన్ని శుభాలే కలుగుతాయని చాలామంది నమ్మకం. ఇళ్లు కట్టడంతో పాటు, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో కూడా ఈ శాస్త్రంలో పొందుపరిచారు.
వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టే ప్రతి వస్తువు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుందట. మరీ ముఖ్యంగా కొన్ని చెట్లు ఇంట్లో ఉండటం వల్ల వారికి నష్టాలే జరుగుతాయట. సంపదపై ఇవి చాలా ప్రభావం చూపిస్తాయట. మరి అవెంటో తెలుసుకోండి.

రావి చెట్టు :
వాస్తు ప్రకారం రావి చెట్టు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుంది. కాబట్టి ఇంట్లో రావి చెట్టు ఉండటం ఎంత మాత్రం మంచిది కాదట. ఇది సంపదపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ రావిచెట్టు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయాలని సూచిస్తున్నారు.

ముళ్ల చెట్లు:
ముళ్ల మొక్కలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యం మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందట. కాబట్టి ఇలాంటివి ఇంటికి దూరంగా ఉంటేనే మంచిది.

ఉసిరి:
ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ, వాస్తు ప్రకారం ఈ చెట్టును ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉసిరి చెట్టు ఇంట్లోని సంతోషాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఉసిరి చెట్టును ఇంట్లో పెంచకపోవడం ఉత్తమం.

