- Home
- Astrology
- Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు అదృష్టం ఎక్కువ.. రాజులాంటి జీవితం గడుపుతారు!
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు అదృష్టం ఎక్కువ.. రాజులాంటి జీవితం గడుపుతారు!
మనిషి జీవితంపై గ్రహాలు, నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుందట. వారు రాజులాంటి వైభవమైన జీవితం గడుపుతారట. అలాంటి శుభ నక్షత్రాలేవో ఇక్కడ తెలుసుకుందాం.

అబ్బాయిలకు అదృష్టం తెచ్చే నక్షత్రాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు చాలా అదృష్టవంతులు. వీరు చిన్ననాటి నుంచే ప్రత్యేక ఆకర్షణ, నాయకత్వ లక్షణాలు, ధైర్యసాహసాలతో ముందుకు సాగుతారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది. మరి ఏ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.
రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్రం చంద్రుడికి అత్యంత ఇష్టమైంది. ఈ నక్షత్రం సంపద, సుఖసంతోషాలకు ప్రతీక. రోహిణి నక్షత్ర జాతకులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కుటుంబం, ఆస్తి, విలాసవంతమైన జీవితం వీరికి సహజంగా లభిస్తుంది. వీరు చేసే పనుల్లో స్థిరత్వం ఉండటంతో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి పేరు సంపాదిస్తారు. రాజుల్లా హుందాగా జీవించాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. అది నెరవేరే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మఖ నక్షత్రం
మఖ నక్షత్రంలో జన్మించిన వారికి పితృదేవతల ఆశీస్సులు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నాయకత్వం, అధికార బలం, పరిపాలనా నైపుణ్యం వీరిలో సహజంగా ఉంటాయి. మఖ నక్షత్ర జాతకులు చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం సంపాదిస్తారు. వీరి మాటకు విలువ ఉండటం, సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాజులాంటి జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
పుష్యమి నక్షత్రం
పుష్యమి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు అదృష్టానికి ప్రతిరూపం. ఈ నక్షత్ర జాతకులు క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సహనంతో ముందుకు సాగుతారు. మొదట్లో కాస్త ఆలస్యం అనిపించినా, వయసు పెరిగేకొద్దీ సంపద, స్థిరత్వం, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వీరికి జీవితంలో ఎలాంటి లోటుండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఉత్తర ఫల్గుణి నక్షత్రం
ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు భాగ్యవంతులు మాత్రమే కాదు.. ధర్మబద్ధమైన జీవితం గడుపుతారు. ఈ నక్షత్రంపై సూర్యుడి ప్రభావం ఎక్కువ కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరులను ఆకట్టుకునే శక్తి కలిగి ఉంటారు. పెళ్లి, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి అన్నింటిలోనూ వీరికి అదృష్టం కలిసివస్తుంది.
స్వాతి నక్షత్రం
స్వాతి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు స్వేచ్ఛా భావం, తెలివితేటలతో ముందుకు సాగుతారు. వీరు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యాపారం, విదేశీ అవకాశాల్లో వీరికి అదృష్టం కలిసివస్తుంది. వీరు డబ్బు సంపాదించడమే కాకుండా, విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికను కూడా నెరవేర్చుకుంటారు.

