Life after Marriage: ఈ తేదీల్లో పుట్టినవారికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసొస్తుంది
Life after Marriage: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన వారు ఎంతో అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఏ తేదీలలో పుట్టిన వారికి పెళ్లి తరువాత అందమైన జీవితం మొదలవుతుందో తెలుసుకోండి.

పెళ్లి జీవితంలోనే పెద్ద మలుపు
పెళ్లి.. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరి జీవితం పెళ్లి తరువాత కచ్చితంగా మారుతుంది. కొందరికి సానుకూలంగా ఉంటే, మరికొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన వారికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసివస్తుంది. వీరి జీవితం పెళ్లి తరువాత ఆనందంగా సాగుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవితంలో ఎదుగుతారు.
ఈ తేదీలలో పుట్టిన వారు
ప్రతి నెల 6, 15, 24 తేదీలలో పుట్టిన వారు ఎంతో అదృష్టవంతులు. వీరి మూల సంఖ్య 6 అవుతుంది. అంటే మీరు పుట్టిన తేదీలోని అన్ని అంకెలను కలిపితే ఆరు వస్తుంది. వీరిపై శుక్రుని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. పెళ్లి తర్వాత వీరి జీవితం స్థిరంగా మారి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. పెళ్లి జరిగిన తరువాత వీరికి జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణ సపోర్ట్ లభిస్తుంది.
మూల సంఖ్య 8
ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీలలో పుట్టిన వారు మూల సంఖ్య 8. వీరి జీవితం పెళ్లి తర్వాత సంతోషంగా మారిపోతుంది. వీరు జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు ఎంతో కష్టపడతారు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సపోర్టు ఇచ్చుకుంటూ ఆర్థికంగా మంచి స్థాయికి ఎదుగుతారు.
మూల సంఖ్య 9
ప్రతి నెల 9, 18, 27 తేదీలలో పుట్టిన వారి మూల సంఖ్య 9. వీరిని పాలించేది కుజుడు. అందుకే వీరికి జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పెళ్లి తర్వాత వీరిలో పట్టుదల మరింత పెరుగుతుంది. దీని వల్ల వీరు వివాహం అయ్యాక మరింత సంపాదించుకునే అవకాశం ఉంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇక్కడ చెప్పిన తేదీలలో పుట్టిన వారికి పెళ్లి తర్వాత అదృష్టం విపరీతంగా కలిసివస్తుంది.

