Vastu Tips: 7 రోజులు ఇలా చేసినా, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది
మనం ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండటం లేదు అంటే.. కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాల్సిందే. మరి, అవేంటో చూద్దామా..

డబ్బు సంపాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. తాము ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని... కష్టపడిదంతా ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలీడం లేదు అని వాపోతూ ఉంటారు. అయితే.. మీరు కష్టపడటమే కాదు... కొన్ని వాస్తు నియమాలు కూడా పాటించాలి. అప్పుడే.. ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా నిలుస్తుంది. మరి, మనం పాటించాల్సిన ఆ వాస్తు నియమాలు ఏంటో చూద్దాం...

డబ్బు రావాలంటే, పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చి శుభ్రం చేయాలి. చాలా మంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే.. వీకెండ్ లో మాత్రమే చేసే పనిగా ఫీలౌతారు. లేదంటే.. ఎప్పుడో తమకు కుదిరినప్పుడు ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటారు. కానీ, అలా కాదు, ఉదయాన్నే ఇంటిని ఊడ్చుకోవాలి. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే ఊడ్చాలి. ఇల్లు అస్సలు మురికిగా ఉండకూడదు.

ఇంట్లో దుర్వాసన వస్తే లక్ష్మీదేవి ఉండదు. అందుకే ఇంట్లో మంచి సువాసనలు వెదజల్లాలి. దాని కోసం మీరు రెగ్యులర్ గా ఇంట్లో కర్పూరం, అగరబత్తీలు లాంటివి వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి సువాసనలు వెదజల్లుతాయి. లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగుపెడుతుంది.

ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్ లో ప్రతిరోజూ దుస్తులు ఉతకడం అందరికీ సాధ్యం కాదు. అందులోనూ వాషింగ్ మెషిన్ ఉంది కదా అని వారానికి ఒకసారో, రెండుసార్లో ఉతుకుతూ ఉంటారు. కానీ.. అలా చేయకూడదట. ఇంట్లో మురికి దుస్తులు పోగు చేయకూడదు. ఇది వాస్తుకు చాలా చేటు చేస్తుంది. కబట్టి.. వాటిని ఎక్కువగా పేరపెట్టకుండా ఎప్పటికప్పుడు ఉతుక్కోవడం మంచిది.దీని వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో నిలుస్తుంది.

ఇంట్లో వస్తువులు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. దీనివల్ల పనులు ఆగిపోతాయి. ఎక్కడ ఉండాల్సినవి అక్కడ నీట్ గా సర్దుకోవాలి. అంతేకాదు.. గుమ్మం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. ఏ పని మీద వెళ్లినా అది సక్సెస్ అవుతుంది.

7 రోజులు ఇలా చేస్తే చాలు, డబ్బుతో మీ ఇల్లు నిండిపోతుంది!
అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే విజయాన్ని ఊహించుకోవడం. కళ్ళు మూసుకొని మీ సక్సెస్ గురించి ఆలోచించండి. మీ కోరిక నెరవేరుతుంది. బయటికి వెళ్ళే ముందు ఇల్లు ఊడ్చి, శుభ్రం చేయండి. మురికి ఇంట్లోంచి బయటికి వెళ్లకపోవడమే మంచిది.
డబ్బు రావడానికి వంటగది చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం వంటగది నియమాలపైనే ఇంటి శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. అందుకే వంటగదిలో ఎప్పుడూ గిన్నెలు పేరుకుపోకూడదు. రాత్రి పడుకునే ముందు కిచెన్ తో పాటు.. తిన్న పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది.

