Ugadhi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు
2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో రెండో రాశి అయిన వృషభ రాశివారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం..

Ugadi 2025 vrishabha rashi phalalu taurus Horoscope Yearly Predictions
వృషభ రాశి ఆదాయం-11, వ్యయం-5, రాజ్యపూజ్యం-1, అవమానం-3
2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో రెండో రాశి అయిన వృషభ రాశివారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం..
వృషభ రాశివారికి విశ్వావసు సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది. ముఖ్యంగా ఆర్థికంగా, వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం పరంగా కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు.కొన్ని నెలల్లో అన్నీ అనుకూలంగా ఉన్నా, కొన్ని నెలలో సమస్యలు ఎదురౌతాయి. అయితే..వ్యాపారులకు మాత్రం కాస్త లాభదాయకంగానే ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. బంధాలు మెరుగౌతాయి. ఏప్రిల్ నుంచి గురు గ్రహ ప్రభావం కారణంగా కాస్త ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కానీ, మే నెల తర్వాత గురు గ్రహం మిథున రాశిలోకి మారడంతో ఆ సమస్యలు తగ్గి, అంతా అనుకూలంగా మారుతుంది. శని మీన రాశిలోకి అడుగుపెట్టడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది.

Ugadi 2025 vrishabha rashi phalalu taurus Horoscope Yearly Predictions
విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి ఆర్థిక పరిస్థితి..
ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అందిస్తుందని చెప్పొచ్చు. గురు బలహీన స్థితిలో ఉండటంతో 2025 ప్రారంభంలో వ్యయాలు అధికంగా ఉండే అవకాశముంది. ఆకస్మిక ధన నష్టాలు సంభవించవచ్చు కాబట్టి ఖర్చులను గమనించి పెట్టుబడులు పెట్టాలి. మధ్య కాలంలో అదృష్టం కాస్త మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి. శని మీన రాశి సంచారం కారణంగా 2025 ద్వితీయార్థంలో అకస్మాత్తుగా ధన లాభాలు వస్తాయి. రాహువు ప్రభావంతో కొంత వ్యయ భారమైతే ఉంటుంది కానీ, సంవత్సరాంతానికి ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.

Ugadi 2025 vrishabha rashi phalalu taurus Horoscope Yearly Predictions
విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి ఆరోగ్య స్థితి
వృషభరాశివారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం తొలి భాగంలో శారీరక సమస్యలు వేధించే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. మధ్య కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకోవాలి. ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం ముఖ్యం. 2025 చివరి నెలల్లో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రాహువు, కేతువుల ప్రభావం వల్ల వ్యాధులపట్ల జాగ్రత్తగా ఉండాలి.

Ugadi 2025 vrishabha rashi phalalu taurus Horoscope Yearly Predictions
విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారం & వృత్తి ఎలా ఉండనుందంటే..
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రగతి మందకొడిగా ఉంటుంది. మార్చి నెల తర్వాత ఉద్యోగ మార్పుల అవకాశాలు వస్తాయి. మధ్యలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు శని మిశ్రమ ప్రభావం చూపించనుంది. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 2025 రెండో భాగంలో వ్యాపారాలలో స్థిరత కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.

Ugadi 2025 vrishabha rashi phalalu taurus Horoscope Yearly Predictions
విశ్వావసు నామ సంవత్సరాలో వృషభ రాశివారికి ఏ నెలలో ఎలా ఉండనుందంటే...
ఏప్రిల్ 2025
ఈ నెల మిశ్రమ ఫలితాల్ని అందిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపై దృష్టి పెట్టాలి.
మే 2025
ఈ నెలలో ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురవొచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కానీ కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొంత లాభదాయకమైన కాలం.
జూన్ 2025
ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. ప్రయాణాలు అధికమవుతాయి. కొత్త పెట్టుబడులు వద్దు. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు రావొచ్చు.
జూలై 2025
పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కొంత సానుకూల దశ కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతికి తగిన అవకాశాలు వస్తాయి.
ఆగస్టు 2025
ఈ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాలలో కొంత అనిశ్చితి ఉండొచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి.

Ugadi 2025 vrishabha rashi phalalu taurus Horoscope Yearly Predictions
సెప్టెంబర్ 2025
ఆర్థికంగా కొంత లాభదాయకమైన నెల. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉంటాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి.
అక్టోబర్ 2025
ఆరోగ్యపరంగా అనుకూలమైన నెల. ఉద్యోగస్తులకు వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూలమైన సమయం.
నవంబర్ 2025
ఆర్థికంగా కొంత ఒడిదుడుకులున్నా, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో కొంత మిశ్రమ స్థితి నెలకొనవచ్చు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం.
డిసెంబర్ 2025
ఈ నెల శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారస్తులకు మరింత స్థిరత్వం లభిస్తుంది.
జనవరి 2026
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం. కుటుంబసభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి.
ఫిబ్రవరి 2026
ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగం చేసుకోవడం మంచిది.
మార్చి 2026
ఆర్థికంగా కొంత స్థిరత లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం.
చివరగా..
ఈ సంవత్సరం వృషభరాశివారికి కొంతవరకు అనుకూలమే. అయితే వ్యయాలు పెరిగే అవకాశం ఉండటంతో ఆదాయ-ఖర్చులను సమతుల్యం చేసుకోవడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వృత్తి & వ్యాపార రంగంలో పురోగతి ఉండేందుకు కృషి చేయాలి.

