MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ugadi RashiPhalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలు

Ugadi RashiPhalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలు

2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో పదో రాశి అయిన మకర రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.  

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 26 2025, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ugadi 2025 makara rashi phalalu capricorn Horoscope Yearly Predictions for capricorn

Ugadi 2025 makara rashi phalalu capricorn Horoscope Yearly Predictions for capricorn

మకర రాశి ఆదాయం-8, వ్యయం-14, రాజ్యపూజ్యం-04, అవమానం-05


2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో పదో రాశి అయిన మకర రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
capricorn

capricorn

విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉండనుంది.గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు ఈ ఏడాదిలో తగ్గిపోవడం ఖాయం. గురు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. కొంతకాలంగా ఎదురైన చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులు, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. శని మీన రాశిలో ఉండటం వల్ల ఉద్యోగంలో కూడా మంచి జరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఈ ఏడాది ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగులుగుతారు.

35
Capricorn Zodiac

Capricorn Zodiac


విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఆర్థిక స్థితి:
ఈ సంవత్సరం ఆర్థికపరంగా మకరరాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాహువు మే 2025 నుండి రెండవ స్థానంలో సంచరించడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల పొదుపు ధోరణిని అలవర్చుకోవడం అవసరం. నూతన పెట్టుబడులు పెట్టే ముందు సరైన ఆలోచన చేయాలి.

45

విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఆరోగ్య పరిస్థితి:
ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మే నెల తర్వాత కేతువు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేలా మెడిటేషన్, యోగాను అలవాటు చేసుకోవడం మంచిది. శరీర సంబంధిత చిన్నచిన్న సమస్యలు ఎదురుకావచ్చు. పాత అనారోగ్య సమస్యలు తిరిగి రావచ్చు. రాహు ప్రభావం వల్ల తలనొప్పులు, గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.

విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి ఉద్యోగ, వ్యాపార స్థితి:
ఉద్యోగస్తులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కష్టపడి పని చేసిన వారికి ఇప్పుడు ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి సెకండ్ హాఫ్ మంచి అవకాశాలు తెస్తుంది. వ్యాపారస్తులకు ఇది అభివృద్ధికి దారితీయగలదని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులకు మంచి సమయం. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు కొనసాగించే ముందు సరైన ప్రణాళిక చేసుకోవాలి. విదేశీ వ్యాపార లావాదేవీలకు కొంత అవరోధాలు ఎదురవచ్చు.
 

55
capricorn

capricorn

మాసవారి ఫలితాలు
ఏప్రిల్ 2025:
ఈ నెల ప్రారంభంలో కొంత ఒత్తిడిగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంత పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాల్లో తొందరపడకుండా ఓపికతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.

మే 2025:
ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం.

జూన్ 2025:
ఈ నెల ఉద్యోగ, వృత్తి రీత్యా కొంత ఒత్తిడిగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. శత్రువులు మీపై ప్రభావం చూపే యత్నం చేస్తారు. ఆరోగ్య పరంగా కొంత అప్రమత్తంగా ఉండాలి.

జూలై 2025:
ఈ నెలలో కొంత సానుకూల మార్పు కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఉంటే అనుకూలంగా మారతాయి. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. కొత్త రియల్ ఎస్టేట్ అవకాశాలు లభించవచ్చు.

ఆగస్టు 2025:
పొదుపు ధోరణిని పాటించడం మంచిది. అప్రయత్నంగా కొన్ని కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

సెప్టెంబర్ 2025:
కొన్ని అనుకోని ప్రయాణాలు ఉండొచ్చు. ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోతే కొంత నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగానూ, గుర్తింపు తక్కువగానూ అనిపించవచ్చు.

అక్టోబర్ 2025:
వ్యాపారాలలో లాభదాయకమైన సమయం. విదేశీ వ్యాపారాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం. కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు అవకాశముంది.

నవంబర్ 2025:
ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశముంది. ధనం, సమ్మానం, గుర్తింపు లభించవచ్చు.

డిసెంబర్ 2025:
కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కానీ ఆర్థికంగా పొదుపుగా ఉండటం మంచిది. వ్యాపారులు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా యథాశక్తి జాగ్రత్తలు తీసుకోవాలి.

జనవరి 2026:
కుటుంబంలో కొంత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో విజయాలు లభించవచ్చు. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరుగుతుంది.

ఫిబ్రవరి 2026:
కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కానీ పాత రుణాలు లేకుండా చూసుకోవడం మంచిది. శత్రువుల నుంచి కొంత ఒత్తిడి ఉండొచ్చు. ఆరోగ్య పరంగా కొంత అప్రమత్తంగా ఉండాలి.

మార్చి 2026:
ఈ నెలలో కొత్త అవకాశాలు లభించవచ్చు. శుభకార్యాల కోసం మంచి సమయం. కొన్ని నూతన పరిచయాలు భవిష్యత్‌లో లాభదాయకంగా మారవచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

శుభ సూచనలు & పరిహారాలు
మకరరాశి వారు గురుదక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దుర్గాదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు. రాహుకాలంలో దుర్గాదేవి పూజ చేసి, దీపారాధన చేయడం ద్వారా అనేక సమస్యలు తొలగిపోతాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దైవదర్శనం చేసుకోవడం ఉత్తమం.

సంవత్సరాంతం:
మకరరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ప్రారంభమైనా, చివరికి మంచి ఫలితాలు అందించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, శ్రమను తగ్గించకుండా ముందుకు సాగితే విజయాలు నిర్ధారణ.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఉగాది
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved