MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ugadi RashiPhalalu:విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు

Ugadi RashiPhalalu:విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు

2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో తొమ్మిదో రాశి అయిన ధనస్సు రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.

3 Min read
ramya Sridhar
Published : Mar 25 2025, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ugadi 2025 Dhanu rashi phalalu Sagittarius Horoscope Yearly Predictions for Sagittarius

Ugadi 2025 Dhanu rashi phalalu Sagittarius Horoscope Yearly Predictions for Sagittarius

ధనస్సు రాశి ఆదాయం-5, వ్యయం-5 ,రాజ్యపూజ్యం-1, అవమానం-52025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో తొమ్మిదో రాశి అయిన ధనస్సు రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
26
Sagittarius

Sagittarius

ఈ విశ్వావసు నామ సంవత్సరం ధనస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో కొంత అశాంతి నెలకొనవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు మరింత ఆలస్యం కావచ్చు. దీని వల్ల మీరు మరింత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అయితే, మే నెల తర్వాత గురుడు మిథున రాశిలోకి అడుగుపెట్టడం వల్ల  మీ పరిస్థితులు మళ్లీ మెరుగౌతాయి. అప్పటి నుంచి మళ్లీ అంతా మంచే జరుగుతుంది. కొత్త అవకాశాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది.  శని మీన రాశిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. అందుకే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీరసం, ఒత్తిడి ఎక్కువ ఉండటంతో మానసిక ప్రశాంతతకు దూరం అయ్యే అవకాశం ఉంది. అయితే, కాలక్రమేనా ఆ సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతాయి.

36
Sagittarius

Sagittarius

విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఆర్థిక స్థితి:
ఆర్థికపరంగా ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులతో ప్రారంభమైనా, మే నెల తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. ఆదాయ మార్గాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొంత వెనుకబడిన పరిస్థితి కనిపించినా, అక్టోబర్ నాటికి లాభదాయక మార్గాలు ఏర్పడతాయి. అప్పులు ఉన్నవారు క్రమంగా వాటిని తీర్చగలుగుతారు. స్థిర ఆస్తి కొనుగోలు చేసే యోచనలో ఉన్నవారు కొంత ఆలస్యం చేయడం మంచిది. ఖర్చులు అధికంగా ఉండటంతో పొదుపు మీద దృష్టి పెట్టడం ఉత్తమం. అకస్మాత్ ధననష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

46
Sagittarius Zodiac

Sagittarius Zodiac

విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఆరోగ్య పరిస్థితి:
శని మీన సంచారం వల్ల ఈ ఏడాది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అనారోగ్య సూచనలు కనిపించవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు, పిత్త సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఆరోగ్య రీత్యా మార్చి, ఆగస్టు, డిసెంబర్ నెలలు కొంత ప్రతికూలంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి. మే నెల తర్వాత శారీరకంగా కొంత మెరుగైన అనుభూతి లభించవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు దూరం అవుతాయి.

56

విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఉద్యోగ, వ్యాపార పరిస్థితి:
ఉద్యోగస్తులకు ఈ ఏడాది ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనిభారంతో పాటు కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, మే నెల తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. పదోన్నతులు, ఉద్యోగ మార్పుల విషయంలో మే – జూన్ నెలలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా, అక్టోబర్ తర్వాత లాభసాటిగా మారే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు వేయాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఖర్చులను నియంత్రించకపోతే వ్యాపారంలో నష్టాలు తప్పవు.

66
Sagittarius

Sagittarius

మాస ఫలితాలు:

ఏప్రిల్ 2025: అనుకూలత తక్కువ. కుటుంబ సమస్యలు. విద్యార్థులకు ఆటంకాలు.

మే 2025: వాహన, భూ కొనుగోలు అనుకూలం. అధికార లాభం. వ్యాపార అభివృద్ధి.

జూన్ 2025: ఆలస్యం. మానసిక ఒత్తిడి. ప్రేమ సంబంధాలు బలపడతాయి.

జూలై 2025: స్థిరాస్తుల పెరుగుదల. కోర్టు వ్యవహారాల్లో విజయాలు.

ఆగస్టు 2025: ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార లాభం. అనారోగ్య సమస్యలు.

సెప్టెంబర్ 2025: అనుకోని ప్రయాణాలు. కుటుంబ కలహాలు. వ్యాపార లాభం.

అక్టోబర్ 2025: ఉత్సాహం. మానసిక ఆనందం. కొత్త పరిచయాలు.

నవంబర్ 2025: మిశ్రమ ఫలితాలు. శతృ జయం. భార్యాభర్తల మధ్య విభేదాలు.

డిసెంబర్ 2025: ధన నష్టం. మానసిక ఒత్తిడి. విద్యపై ఆసక్తి.

జనవరి 2026: అనుకూలం. వాహన సౌఖ్యం. స్నేహితుల సహాయంతో విజయాలు.

ఫిబ్రవరి 2026: అనుకూలత తక్కువ. ఆరోగ్య సమస్యలు. కలహాలు.

మార్చి 2026: కుటుంబంలో ఖర్చులు. గృహ మార్పులు. ఆదాయం పెరుగుతుంది.

శుభ పరిహారాలు:
శనివారాలు శనిదేవునికి తైలాభిషేకం చేయడం మంచిది. గురువారం గురు గ్రహానికి సంబంధించిన పూజలు, దానాలు చేయడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం వల్ల కష్టాలు తగ్గుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఉగాది
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved