Jupiter Transit: గురు సంచారంతో ఈ నక్షత్రాల వారికి రాజయోగం, కోటీశ్వరులయ్యే ఛాన్స్
గురు సంచారం (Jupiter) వల్ల రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల కర్కాటకం, వృశ్చికం, మిథునం, కన్య, తుల రాశులకు హంస, గజకేసరి యోగాలు ఏర్పడతాయి. దీనివల్ల కొన్ని నక్షత్రాల వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఆ నక్షత్రాలు ఎవరో తెలుసుకోండి.

గురు సంచారం
జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం సంపద, జ్ఞానం, అదృష్టానికి కారకుడిగా చెప్పుకుంటారు. గురు గ్రహం రాశి మారినప్పుడు ఆ ప్రభావం పన్నెండు రాశులపై పడుతుంది. ఇది అనేక రకాల ఫలితాలను ఇస్తుంది. పునర్వసు నక్షత్రంలోకి గురు గ్రహం ప్రవేశం కొన్ని రాశుల వారు, నక్షత్రాల వారు కోటీశ్వరులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శుభ్రగ్రహాల కలయిక
రాజయోగం ఉన్న జాతకంలో శుభ గ్రహాలు కలయిక కనిపిస్తుంది. ఈ రాజయోగాలు ఉన్నత హోదా, విజయం, సంపదను అందిస్తాయి. 2025 గురు సంచారంతో కర్కాటక రాశికి హంస రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వృశ్చిక రాశి వారికి విదేశీ అవకాశాల వస్తాయి. వీరి సంపద కూడా పెరుగుతుంది.
మిథున రాశి, కన్యా రాశి
గురు సంచారం మిథున రాశి వారికి ఎంతో కలిసొస్తుంది. వీరికి కొత్త వ్యాపార అవకాశాలు కలుగుతాయి. కన్యా రాశికి కూడా గజకేసరి యోగంతో వ్యాపార విజయం దక్కుతాయి. తులారాశికి ఉన్నత పదవి లభిస్తాయి.
ఈ నక్షత్రాల వారు...
ఒక వ్యక్తి జాతకంలో 2, 9, 11వ గృహాల అధిపతులు కలిస్తే కోటీశ్వర యోగం ఏర్పడుతుంది. ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి సూర్యుడు, గురు గ్రహం కలయికతో విజయం దక్కుతుంది. సంపద పెరుగుతుంది. అశ్విని, భరణి, రోహిణి వారికి వ్యాపార లాభాలు అధికంగా కలుగుతాయి.
ప్రభుత్వ ఉద్యోగాలొచ్చే నక్షత్రాలు
ఒకరి జాతకంలో బుధుడు, శని కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడితే… ఆ సమయంలో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. అలాగే ఆస్తులు కూడ కలిసి వస్తాయ. హస్త, పూర్వాభాద్ర, రేవతి నక్షత్రాల వారికి విపరీత రాజయోగం ద్వారా కోట్ల లాభాలు వస్తాయి.