Zodiac signs: ఈ రాశులవారికి.. రూపాయిని కోటి రూపాయలుగా మార్చగల సత్తా ఉంటుంది.
Zodiac signs: డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ, కొందరు మాత్రమే..ధనవంతులు అవ్వగలరు. జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారు రూపాయిని కోటి రూపాయలుగా మార్చగలరు. బాగా సంపాదిస్తారు.. సంపాదించిన దానిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో వీరికి బాగా తెలుసు.

వృషభ రాశి..
వృషభ రాశిని శుక్రుడు ప్రభావం ఉంటుంది. ఈ రాశవారు లగ్జరీ లైఫ్ ఎక్కువగా కోరుకుంటారు. తమ కోరికలను తీర్చకోవడం కోసం వీరు కష్టపడి సంపాదించడమే కాదు.. సంపాదించిన దానిని ఎక్కడ పొదుపు చేయాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. అంతేకాదు... వీరికి ఎంత లగ్జరీ లైఫ్ నచ్చినా కూడా.. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం అయితే తప్ప ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయరు. ఖర్చు విషయం అయినా, పెట్టుబడులు అయినా.. వీరు ఒకటి కి వందసార్లు ఆలోచించి చేస్తారు.
కన్య రాశి...
బుధ గ్రహం అధిపతిగా ఉండే కన్యారాశి వారు బడ్జెట్ రూపకల్పనలోనూ, నిర్వహణలోనూ నిపుణులు. ప్రతిరోజూ తమ ఖర్చులను నిశితంగా గమనిస్తూ, అనవసర ఖర్చులకు చెక్ పెడతారు. మార్కెట్లో ధరలు మారినా తమ పొదుపు పద్ధతులను మార్చుకోకుండా, లాభాలు ఆర్జించే తెలివితేటలతో ముందుకు వెళతారు.
వృశ్చిక రాశి...
డబ్బు ఎలా రెట్టింపు చేయాలో ఈ రాశివారికి బాగా తెలుసు. ఎక్కడ పెట్టుబడితే రెట్టింపు లాభాలు వస్తాయో బాగా తెలుసుకుంటారు. వీరు ఎందులో పెట్టుబడి పెట్టినా నష్టాలు మాత్రం తెచ్చుకోరు. ఎందులో అయినా పెట్టుబడి పెడితే.. లాభం వచ్చే వరకు వదిలిపెట్టరు.నష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండటం వల్ల, కష్టకాలంలోనూ పుంజుకుని సంపదను సమకూర్చుకుంటారు.
ధనుస్సు రాశి..
సంపదకు అధిపతి అయిన గురు గ్రహం ఈ రాశికి అధిపతిగా ఉండటం విశేషం. తమ కష్టార్జితాన్ని ఎంతో గౌరవిస్తూ, డబ్బును ఎప్పుడూ దుబారా చేయకుండా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. తమ ప్రయత్నాలలో వైఫల్యాన్ని అస్సలు సహించని వీరు, నిరంతరం శ్రమించి సత్ఫలితాలను సాధిస్తారు.
మకర రాశి
శని ఆధిపత్యం ఉన్న ఈ రాశి వారు క్రమశిక్షణకు, కష్టపడి పనిచేయడానికి మారుపేరు. డబ్బు ఆదా చేసేవారి జాబితాలో వీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. ప్రతి రూపాయిని లెక్క వేసుకుంటూ, ఎలాంటి అనవసర ఖర్చులకు తావు లేకుండా జాగ్రత్తగా జీవించడం వీరి ప్రధాన ప్రత్యేకత. డబ్బు దాయడం కాదు.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వీరికి బాగా తెలుసు.

