MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఆర్థిక కష్టాలు తప్పవు

Today Horoscope: ఓ రాశివారికి ఆర్థిక కష్టాలు తప్పవు

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 07 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

7-6-2024 శుక్రవారం  మీ రాశి ఫలాలు 


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. బాగా కష్టపడితేనే మీరు చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడాయి. ఉద్యోగులు ఆశించిన ఉద్యోగాన్ని పొందలేరు. పనిలో, కుటుంబంలో బాధ్యత బారం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందలేరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మీరు ఊహించని విధంగా ధనయోగం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. చిన్ననాటి స్నేహితులతో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. వ్యాపారంలో కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు. ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనులను పూర్తి చేస్తారు. 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఆర్థికంగా మారింత బలంగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయ. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- పనికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అర్థాంతరంగా ఆగిపోతాయి. వ్యాపారులు చిన్నమొత్తంలో లాభాలను పొందుతారు. 
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ఇంటిపనులు, బయటిపనుల వల్ల బాగా ఒత్తిడికి గురవుతారు. మొదలుపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. భూ క్రయ, విక్రయాల విషయంలో ఆశించిన లాభాలను పొందుతారు. పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగులకు ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. ఇన్నాళ్లుగా వసూలు కానీ బాకీలు వసూలవడంతో ఆనందంగా ఉంటారు. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- మీ మాటతీరుతో ఇంట్లోనే కాదు సమాజంలో కూడా మీ విలువ పెరుగుతుంది.  వాహన వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఆత్మీయుల పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులు ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యులు ఎదురుచూస్తున్న అవకాశాలను పొందుతారు. తెలివితో ప్రత్యర్థుల ప్రశంసలు కూడా పొందుతారు. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంద. దీంతో విశ్రాంతి తీసుకోకపోవడంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రయాణాల వల్ల ఎలాంటి లాభం ఉండదు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవా? కావా? అని ఒక సారి ఆలోచించుకోవాలి. దైవ దర్శనానికి కుటుంబ సమేతంగా వెళతారు. నూతన వ్యాపారం ప్రారంభం మధ్యలోనే ఆగిపోవచ్చు. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఇంటి వాతావరణం చిరాకు కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో పనిభారం బాగా పెరుగుతుంది. వ్యాపారులు ఎంత కష్టపడ్డా ఫలితాన్ని మాత్రం పొందలేరు. వృత్తి, వ్యాపారం గురించి ఇతరులతో చర్చించడం నష్టానికి దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మంచి లాభాలను పొందుతారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తాలు వింటారు. నూతన వాహనాన్ని కొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందడంతో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )


దిన ఫలం:- వ్యాపారం విషయంలో ఇతరుల సలహాలు, సూచనలు పాటించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం విషయంలో మీ చర్చలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులు సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. 
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. మీ ఆలోచనలను తప్పుగా భావించి మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం ఒత్తిడికి దారితీస్తుంది. ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి. వ్యాపారం సాఫీగా సాగదు. ఉద్యోగులకు పనిబారం పెరుగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved