Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
telugu astrology
మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-వాతావరణ మార్పు వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. విద్యార్థులు ఊహించినట్టు ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. చిన్న నాటి స్నేహితులతో మాట పట్టింపులు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార ఉద్యోగులు పని ఒత్తిడికి లోనవుతారు.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-అప్పుల బాధలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారుల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
telugu astrology
మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:- సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తుల ఆహ్వానం అందుతుంది. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలను పెంచుకుంటారు.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-మొదలుపెట్టిన పనులను విజయ వంతంగా పూర్తి చేస్తారు. కొందరి పరిచయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోధాల్లో పాల్గొంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది. వ్యాపార ఉద్యోగులకు ఆనందంగా రోజు గడిచిపోతుంది.
telugu astrology
సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-బంధుమిత్రులతో మాట పడాల్సి వస్తుంది. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సహాయం పొందుతారు. ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోవడంతో చిరాకు కలుగుతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:- పనిబాధ్యతలు పెరుగుతాయి. దీంతో మీకు విశ్రాంతి తీసుకునే సమయం ఉండదు. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి లోనవుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడిని కలిగిస్తుంది.
telugu astrology
తుల (చిత్త 3 4 స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )
దిన ఫలం:-తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వాహనం కొనే సూచన ఉన్నది. ఆస్థికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-అనుకోకుండా ముఖ్యమైన పనులను వాయిదా వేయాల్సి వస్తుంది. కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. దైవ చింతనలో ఉంటారు. ఇంట్లో వారితో గొడవ పడతారు. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి.
telugu astrology
ధనుస్సు (మూల, పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-ఇంటా, బయట మీ విలువ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ మీరు అనుకున్నట్టుగానే సాగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:- వ్యాపారులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఫలితం మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. ఇంట్లో వారి ప్రవర్తన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీకు మానసిక సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఉద్యోగులకు అధికారులతో మాటలు పడతారు.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులను కొనే యోగం ఉంది. సమాజ సేవలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు మంచి లాభాల్లో నడుస్తాయి. ఉద్యోగుల జీతం పెరుగుతుంది.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-ఉద్యోగులు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన ఆదాయా మార్గాలను పొందుతారు. సంఘంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపును పొందుతారు. సేవా కార్యక్రమాలు లో పాల్గొంటారు. ఉద్యోగాలకు అధికారుల ఆదర అభిమానం దొరుకుతుంది.