MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు ఒక చేత్తో సంపాదించి, రెండు చేతులతో ఖర్చుపెడతారు

Today Horoscope: ఓ రాశివారు ఒక చేత్తో సంపాదించి, రెండు చేతులతో ఖర్చుపెడతారు

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

7 Min read
Shivaleela Rajamoni
Published : Apr 12 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
telugu astrology

telugu astrology

12-4-2024,  శుక్రవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)
         
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులు తో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

భరణి నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

కృత్తిక నక్షత్రం వారికి సంపత్తార  (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు

దిన ఫలం:-పనులు శ్రీఘ్రంగా పూర్తవుతాయి.ఉద్యోగాలు లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న ఇబ్బందులు తొలగి పోతాయి.నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి.ఆర్థిక విషయాలు బలపడతాయి.వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందుతారు.సమస్యలు పరిష్కారమవుతాయి.నూతన ప్రయత్న ఆలోచనలు ఫలిస్తాయి.ఓం నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

మృగశిర నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవును.తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు.ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇతరులకు సహాయ సహకారాలు అందజేస్తారు.సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు.ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) ముఖ్యమైన పనులను పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకొంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

పునర్వసు నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) ప్రయత్న కార్యాలకు ఆటంకములు కలుగ గలవు.ఊహించని విధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి.

దిన ఫలం:-అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.వివాదాలకు దూరంగా ఉండాలి.  వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది.వ్యవహార విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక చేత్తో సంపాదిస్తారు. రెండు చేతులతో ఖర్చుపెడతారు. భార్య తో సఖ్యత గా మెలగాలి. మనస్పర్థలు మరియు కలహాలు రాగలవు జాగ్రత్త అవసరం. సమాజములో సంభాషణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఓం భద్రకాళ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు.కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఆశ్రేష నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో మనస్పర్థలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాల్లో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-తలపెట్టిన  పనులు పట్టుదలతో పూర్తి చేయాలి.ఉద్యోగాలలో సహోద్యోగులతో చిన్నపాటి సమస్యలు అపార్థాలు రాగలవు. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ వహిస్తే మంచి లాభాలు పొందగలరు.సమాజంలో ఆవేశపరిచేవారున్నారు.ఉద్యోగాలు లో శాంతంగా పని చేయండి.ఆర్థిక పరంగా అనుకూలం.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.ఓం ఆది భూతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులు తో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-ఆటంకాలను అధిగమిస్తారు.ఉద్యోగం లో అధికారుల సహకారం లభిస్తుంది.బంధు మిత్రులతో సంబంధాలు లపడతాయి.వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరిస్తారు. జీవితం ఆనందకరంగా ఉంటుంది.కళాకారులు కు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

చిత్త నక్షత్రం వారికి పరమ మిత్ర  తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వాహన యంత్రాధులతో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-వ్యాపారపరంగా అనుకూలం.అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా అవకాశం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది.కుటుంబ బాధ్యతలు ను సకాలంలో పూర్తి చేయాలి.ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.అధికారుల సహకారం లభిస్తుంది.ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) ముఖ్యమైన పనులను పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకొంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

విశాఖ  నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) ప్రయత్న కార్యాలకు ఆటంకములు కలుగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగాలకు అధికారులు తో కలహాలు ఏర్పడవచ్చు. మిత్రులతో సఖ్యత గా ఉండాలి.ఖర్చు విషయంలో ఆలోచించాల్సి వస్తుంది.దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి.శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఖర్చుల నియంత్రణ తప్పనిసరి.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

జ్యేష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో మనస్పర్థలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాల్లో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తికమక  గా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఖర్చుల నియంత్రణ అవసరం.బంధు వర్గము తో పనులు నెరవేరుతాయి. శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది.ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులు తో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

పూ.షా  నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

ఉ.షాఢ నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-వ్యాపారంలో శ్రద్ద వహించాలి.మనోబలంతో పనులు ప్రారంభించడం మంచిది. విభేదాలకు దూరంగా ఉండండి.సున్నితంగా వ్యవహరించాలి.చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. బాధ్యతలు సకాలంలో పూర్తి చేయాలి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి.సమాజంలో అపార్థాలకు తావివ్వవద్దు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు .

ధనిష్ఠ నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-దేవతారాధన  సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.వ్యవహార విషయాలు ఇంట్లో వారితో చర్చించడం వల్ల పరిష్కారం లభించవచ్చు.సహోద్యోగులు తో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆపద నుంచి బయటపడతారు.ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది.ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకొంటారు ఆనందంగా గడుపుతారు.ధనలాభం

పూ.భా నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) ప్రయత్న కార్యాలకు ఆటంకములు కలుగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలు లో అధికారులు యొక్క ఆదరణ పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.ముఖ్యమైన కార్యాల్లో విజయం లభిస్తుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు కలిసివస్తుంది.ఓం కీర్తి లక్ష్మ్యై  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు)  రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో మనస్పర్థలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాల్లో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-జీవిత భాగస్వామి తో విభేదాలు రాగలవు.అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.తలపెట్టిన పనుల్లో కృషిని బట్టి విజయం లభిస్తుంది.అనుకోని తెలియని ఖర్చులు ఎదురవుతాయి.కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved