MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి అనుకోని సంఘటనలు వల్ల ఇబ్బందులు

Today Horoscope: ఓ రాశివారికి అనుకోని సంఘటనలు వల్ల ఇబ్బందులు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.

7 Min read
ramya Sridhar
Published : Nov 18 2023, 04:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

18-11-2023,  శనివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
పంచాంగం                                                                                                                                                                                                                                             
తేది :    18నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
శనివారం
తిథి :- పంచమి ఉ॥9.48 ని॥వరకు
నక్షత్రం :- ఉ.షా రాత్రి 1.17 ని॥వరకు
యోగం:- శూలము ఉ॥6.58 గండము తె.4.21 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥9.48 కౌలవ రాత్రి 8.48  ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.12 ని॥ల 8.43 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.06.10 ని॥ల ఉ.7:39 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥10.06 ని॥ల 11.37 ని॥వరకు తిరిగి తె.5.02 ని॥ల
రాహుకాలం:- ఉ.9:00 ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :-    6.09 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.21ని॥లకు
 

213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార)
భరణి నక్షత్రం వారికి  (సంపత్తార)
కృత్తిక నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది విలాస వస్తువులపై అధికంగా ఖర్చు చేస్తారు. కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఆదాయ మార్గాలపై అన్వేషణ చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండును. రావలసిన పాత బాకీలు వసూలు అగును. ముఖ్యమైన విషయాలలో పెద్దవారి సలహాలు తీసుకుంటారు. పట్టుదలతో చేసిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. ఓం మహేశ్వరాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (జన్మ తార)
రోహిణి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
మృగశిర నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది.ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండండి. చేయి పనులలో ఆవేశం తగ్గించుకుని నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్య విషయాలు లో జాగ్రత్త వహించాలి.జీవిత భాగస్వామి తో సఖ్యతగా ఉండాలి.శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఓం మహాదేవాయ అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (మిత్రుతార)
ఆరుద్ర నక్షత్రం వారికి (నైధన తార)
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు.అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘములో మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఓం పురుషోత్తమాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)
పుష్యమి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనస్సులో ఆందోళనగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అకారణంగా గొడవలు రాగలవు. తలపెట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి.  అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఓం ఆంజనేయాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.


 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (విపత్తార)
పూ.ఫ నక్షత్రం వారికి (సంపత్తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రాగలవు .ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన  పనులలో ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. అనుకోని కొన్ని సంఘటనలు వలన అచేతన స్థితి ఏర్పడును.కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఓం కుమారాయ నమః  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మ తార)
హస్త నక్షత్రం వారికి (పరమైత్ర తార)
చిత్త నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అగును. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ఖర్చులు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తి కాగలవు.విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి.  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును.  ఇతరులతో వాద వివాదాలు లకు  దూరంగా ఉండాలి.వాహన ప్రయాణాలు విషయంలో  తగు జాగ్రత్తగా తీసుకొనవలెను.ఓం నవదుర్గాయై నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (మిత్ర తార)
స్వాతి నక్షత్రం వారికి (నైధన తార)
విశాఖ  నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. చేయు పనులలో సూక్ష్మ బుద్ధి తో ఆలోచించి చేయవలెను. ఇతరులతో తొందర పాటు మాటలు మాట్లాడవద్దు. భూ గృహ క్రయ విక్రయాలు  లాభించును. పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఓం బృగవే నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)
అనూరాధ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (క్షేమతార)


దిన ఫలం:-అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. పనివారితో  ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదల తో పూర్తి చేయాలి.ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను. ఇంటా బయట ప్రతికూలత వాతావరణం. బంధు మిత్రులతో మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.ఓం అర్కాయ నమః అని  జపించండి.శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (విపత్తార)
పూ.షా  నక్షత్రం వారికి  (సంపత్తార)
ఉ.షా  నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగును. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో  పాల్గొంటారు.ఓం కుమారాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (జన్మ తార)
శ్రవణం నక్షత్రం వారికి (పరమైత్ర తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి  చికాకుగా ఉంటుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉండటం. అనవసరమైన ఖర్చులు పెరుగును.వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. వ్యవహారాలలో అన్నదమ్ముల సహాయ సహకారములు లభించును. సంతానము తో ప్రతికూలత వాతావరణం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘము లో వ్యవహార విషయాలు తెలివిగా వ్యవహరించవలెను. ఓం విశ్వేశ్వరాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి (మిత్ర తార)
శతభిషం నక్షత్రం వారికి  (నైధన తార)
పూ.భా నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలకమైన సమస్యలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారాలు లో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం సభ్యులు తో ప్రతికూలత వాతావరణం. అనవసర ఆలోచనతో సమయాన్ని వృధా చేయకండి.ఓం చండికాయై నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
రేవతి నక్షత్రం  వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-అనుకున్న పనులు సానుకూలంగా పూర్తి అవుతాయి. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు.నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహములో సంతోషకరమైన వాతావరణం. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరుగును. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఓం పశుపతయే నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత అద్భుతంగా ఉంటుంది, సంపద పెరుగుతుంది..!
Recommended image2
కన్య రాశివారికి కొత్త ఏడాదిలో ఎలా ఉండనుందో తెలుసా?
Recommended image3
Mars Transit: ఈ రాశులకు పెరగనున్న కుజ బలం.... అదృష్టం జేబులో పెట్టుకొని తిరిగినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved