Today Horoscope: ఓ రాశివారికి అన్నిటా విజయమే, ధనలాభం
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం:
పంచాంగం
తేది 12డిసెంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిర
ఋతువు : హెమంత
పక్షం : కృష్ణ పక్షం
వారము: సోమవారం
తిథి : చవితి మధ్యాహ్నం 3. 40 నివరకు
నక్షత్రం*. పుష్యమి రాత్రి 9.22 ని వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం:మ.12.15ని. నుండి మ.12.59ని. వరకు తిరిగి మ.02.27ని. నుండి మ.03.1 1ని. వరకు
రాహుకాలం:మ.01.30ని నుండి మ.03.00ని వరకు
యమగండం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.25ని.లకు
సూర్యాస్తమయం: సా.05.24ని.లకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ పూర్తవును. ఉద్యోగమునందు సహోదయోగల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.పాత బాకీలు వసూలగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఓం వరలక్ష్మియై నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడను ప్రయాణాల్లో వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం సంతాన విషయంలో సఖ్యత సఖ్యతగా వెలుగులను ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను కలహాలకు దూరంగా ఉండండి మనసు నందు భయం భయంగా ఉంటుంది ఏ శారీరక శ్రమ అధికంగా ఉండును ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఏర్పడను ఆ కారణమైన ఆవేశం తగ్గించుకుని నిర్ణయాలు తీసుకొనవలెను సమాజం నందు నిందారోపణలు ఏర్పడగలవు ఈరోజు మీరు ఓం శివాయ నమః అనే 11 సార్లు జపించండిశుభఫలితాలు పొందండి
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చెడువార్తల వలన మనసు నందు బాధ కలుగుతుంది. తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. చేయ పని వారి తోటి సఖ్యతగా ఉండవలెను. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగమునందు అధికార తోటి కలహాలు ఏర్పడవచ్చును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ఈరోజు ఓం దుర్గాయై నమః అని 11 సార్లు జపించండి సహాశుభ ఫలితాలను పొందండి
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు. అకారణ కోపానికి పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్తుంది. సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మిత్రాయ నమఃఓం అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
సమాజము నందు అపవాదులు. తొందరపాటు మాటల వలన కలహాలు ఏర్పడుతాయి. చేయ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మనస్సునందు అనేక సమస్యలు చికాకులు ఏర్పడవచ్చు. హీనమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ప్రయాణాలయందు మరియు పని యందుజాగ్రత్త వహించవలెను. ఈరోజు ఓం శంభవే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలయంతో ఊహించిన ధన లాభములు కలుగును. మనసునందు ఆందోళన తీరి ప్రశాంతత లభించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారా లభిస్తాయి. శుభవార్త వింటారు. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించును. విందూ వినోదాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఓం మహాలక్ష్మియైనమః అని 11 సార్లు జపించండి మంచి శుభ ఫలితాలను పొందండి
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. సమాజము నందు మీ బ్రతుకు తగ్గ గౌరవం లభించును. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. హిందూ వినోదాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులు కలయిక. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను వసూలు అగును. సోదరి సహోదర వలన మనస్పర్ధలు రావచ్చు. సహచరుల వలన అపకారాలు జరగవచ్చును. ఈరోజు ఓం నమో నారాయణాయ అను నామాన్ని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. చేయు వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. బ్యాంకుల నుంచి పెద్దమొత్తం ధనం డ్రా చేసే విషయంలో మరొకరి సాయం తీసుకోవటం క్షేమదాయకం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చును. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఓంసుబ్రహ్మణ్యాయ నమః అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దంపతుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యంవిషయంలో జాగ్రత్త వహించాలి. ఓం కరుణాయైనమఃనమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ఓం సదాశివాయ నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో టి కలిసి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఓం మహేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4
:ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో తోటివారు సహాయ సహకారాలందిస్తారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అని11సార్లు చూపించండి శుభ ఫలితాలు పొందండి.