Horoscope Today : ఈ రాశి వారికి వస్తు వాహన ప్రాప్తి. వృత్తి వ్యాపారాల యందు లాభం.
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తులతో పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఏసీ, కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి . సోదరి, సోదరుల మధ్య విమర్శలు తప్పవు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
అనవసర ఖర్చులు. చేయి పనులయందు నిరాసక్తత. అకారణంగా కోపం. పోయిన వస్తువు తిరిగి లభిస్తాయి. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో అసహనానికి లోనవుతారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. స్త్రీలు, కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి. ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు. నూతన వస్తు వాహన ప్రాప్తి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
అనవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సంఘంలో మంచి గుర్తింపులభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కష్టించిన పనులలో లాభం చేకూరుతుంది. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలు సామాన్యం. ఓం దుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
చేయి పనులలో ఆలస్యం. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. వివాహ సంబంధమై దూరప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలు చేస్తారు. కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
కొత్త వ్యక్తులతో పరిచయాలు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అసరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అనేక విధాలుగా ధనలాభం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. వృత్తి వ్యాపారాల యందు లాభం. ఓ మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
చేయి పనులయందు నిరాసక్తత. అకారణంగా కోపం. అనవసర ఖర్చులు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు.అనుకోని వస్తు ప్రాప్తి. వస్తువులు తిరిగి లభించుట. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
కష్ట పడిన పనుల్లో లాభం చేకూరును. అనవసరమైన గొడవలు. మీ వాక్ చాతుర్యంనకు, తెలివి తేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి.మానసిక ఒత్తిడి. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు సామాన్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
శుభవార్తలు వింటారు. వృత్తి,వ్యాపారాలలో యందు ధనలాభం. శుభకార్యాలు చేస్తారు. ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. లిటిగేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. బంధు మిత్రుల కలయిక. సంఘంలో గౌరవం. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. నమో నారాయణాయ మంత్రం 21 సార్లు జపించిన శుభం జరుగును.
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. . మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించన చికాకులు అధికమవుతాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు. . భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి పరిచయాలు. వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. ఓ మహాలక్ష్మి నమః మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవం, ప్రతిష్టలు. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు. పుణక్షేత్రాలను దర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
మానసిక ఒత్తిడి. వ్యాపారాలు సామాన్యం. అనవసరమైన ఆలోచనలు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు, అధికారుల వేధింపులు అధికమవుతాయి.అనవసరమైన గొడవలు. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. ఓం దుర్గాయై నమః అనే మంత్రమును 21 సార్లు జపించిన లాభం చేకూరుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. ఆకస్మిక ధన లాభం. గృహమునందు శుభకార్యములు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జార విడచుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరుప్రతిష్టలు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రము 21 సార్లు జపించిన శుభం జరుగును.
ఈ రోజు పంచాంగం
తేది : 8, మే 2022
ప్రదేశము : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,ఇండియా
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(నిన్న ఉదయం 11 గం॥ 8 ని॥ నుంచి
ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 52 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి
(నిన్న ఉదయం 9 గం॥ 5 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 30 ని॥ వరకు
వర్జ్యం :(ఈరోజు రాత్రి 1 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు రాత్రి 2 గం॥ 55 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 26 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 34 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 18 ని॥ లకు
జోశ్యుల విజయ రామకృష్ణ
ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)