- Home
- Astrology
- Horoscope Today : ఈ రోజు ఈ రాశివారికి... ఆర్థికస్థితి మెరుగుపడుతుంది.. అనుకోని ధనలాభం..!
Horoscope Today : ఈ రోజు ఈ రాశివారికి... ఆర్థికస్థితి మెరుగుపడుతుంది.. అనుకోని ధనలాభం..!
మే 6 శుక్రవారం 2022 మీ రాశి ఫలాలు .. రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాల్లో తెలుసుకుందాం

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
చేయు పనుల యందు ఆటంకములు. ఎక్కువ కష్టపడతారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. అధికారులకు సాదరవీడ్కోలు పలుకుతారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారముల యందు నిరాశ. గృహ,భూ లాభం. కష్టముతో చేయు పనిలో జయము సిద్దించును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
అనవసర ఖర్చులు చేస్తారు. పట్టుదలగా ఉంటారు. అకారణంగా కోపం వచ్చును. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. నష్టపోయిన ధనం, వస్తువులు తిరిగి రాగలదు. చేయు పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగ, వ్యాపారములు మందగిస్తాయి. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
శుభ వార్తాశ్రవణం .ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు. హుందాతనంగా ఉంటారు. ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
ఆలొచన, కోపం, గట్టిగా మాట్లాడుట, చేయు పనుల యందు ఆలస్యం, ధన నష్టం. గొడవలు.బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్ళు అధికం. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
చేయు పనుల యందు ఆటంకములు. ఎక్కువ కష్టపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. అనవసర ఆలోచనలు చేస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఉద్యోగ, వ్యాపారముల యందు నిరాశ. గృహ,భూ లాభం. కష్టముతో చేయు పనిలో జయము సిద్దించును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
అనవసర ఖర్చులు చేస్తారు. పట్టుదలగా ఉంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడితప్పదు. అకారణంగా కోపం వచ్చును. నష్టపోయిన ధనం, వస్తువులు తిరిగి రాగలదు. చేయు పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగ, వ్యాపారములు మందగిస్తాయి. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
శుభవార్తాశ్రవణం .ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. వ్యాపార వర్గాల వారికి పన్నులు, ప్రభుత్వ విధానాలు అందోళన కలిగిస్తాయి. ఆర్థికస్థితి మునుపటి కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. మిత్రుల కిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
ఆలొచన, కోపం, గట్టిగా మాట్లాడుట, చేయు పనుల యందు ఆలస్యం, ధన నష్టం. గొడవలు. మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం.ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
చేయు పనుల యందు ఆటంకములు. ఎక్కువ కష్టపడతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో మెలకువ అవసరం. అనవసర ఆలోచనలు చేస్తారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారముల యందు నిరాశ. గృహ,భూ లాభం. కష్టముతో చేయు పనిలో జయము సిద్దించును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
శుభ వార్తాశ్రవణం .ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు. హుందాతనంగా ఉంటారు. ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
శుభ వార్తాశ్రవణం .ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. .కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు. హుందాతనంగా ఉంటారు. ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.నిరుత్సాహం విడనాడి పట్టుదలతో కృషి చేసిన మీ ధ్యేయం నెరవేరగలదు.ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.
మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
ఆలొచన, కోపం, గట్టిగా మాట్లాడుట, చేయు పనుల యందు ఆలస్యం, ధన నష్టం. గొడవలు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి . మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.
Daily Horoscope 2022 - 23
ఈ రోజు పంచాంగం
తేది : 6, మే 2022
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
తదుపరి : షష్టి
నక్షత్రం : ఆరుద్ర
ఈరోజు ఉదయం 6 గం॥ 32 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు రాత్రి 7 గం॥ 49 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 35 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 37 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 16 ని॥ లకు
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)