Today Horoscope: ఓ రాశివారికి ధనలాభం
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నూతన వ్యక్తుల పరిచయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహకారం లభిస్తుంది.
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
పంచాగం
తేది : 12 జూన్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి రా.10.07ని.ల వరకు
నక్షత్రం : విశాఖ రా.10.14ని.ల వరకు
వర్జ్యం : ఉ.శే వ ఉ.06.10ని.ల వరకు రా.వ. 02.00ని.ల నుండి రా. తె.03.31ని.ల వరకు
దుర్ముహూర్తం : సా.04.45ని.ల నుండి సా.5.37ని.ల వరకు
పితృ తిథి త్రయోదశి
రాహుకాలం : సా.4.30ని.ల నుండి సా.6.00ని.ల వరకు
యమగండం : మ.12.00ని.ల నుండి మ.1.30ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:28ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:30ని.ల వరకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శారీరక శ్రమ. అనవసరమైన ఆలోచనలతో కాలాయాపన. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు. వృత్తి వ్యాపారాలు నిరాశ. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం. అకారణంగా కోపం. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. గృహమునందు చికాకులు. అపనిందలు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వృత్తి వ్యాపారాలలో లాభం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. గృహంలో అనుకూలమైన వాతావరణం.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
విలాసవంతమైన వస్తువులను కొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు.మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి . చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. అన్నదమ్ములతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. చేయి పనుల యందు కఠినంగా వ్యవహరిస్తారు.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అకారణంగా కోపం. చేయు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పై అధికారులతో చిక్కులు. అనవసరమైన ఖర్చులు. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. చేయు పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
దేవాలయ సందర్శన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. వృత్తి వ్యాపారాలలో ధనవ్యయం. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఓ వార్త మీకు ఉత్సాహం కలిగిస్తుంది. సంఘంలో వాదోపవాదములు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాల యందు లాభం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు.కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో పేరు ప్రతిష్టలు. వృత్తి వ్యాపారాలలో లాభం. మానసిక ప్రశాంతత. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. బంధు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ.వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో పెద్దవారితో పరిచయాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.