MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!

Saturn Transit: 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఉదయించనున్న శని...అదృష్టమంతా ఈ మూడు రాశులదే..!

Saturn Transit: 30 సంవత్సరాల తర్వాత,శని గ్రహంమీన రాశిలో ఉదయించనుంది. శని సంచారంలో మార్పులు జరిగిన ప్రతిసారీ దాని ప్రభావం 12 రాశులపై పడుతుంది. ఏప్రిల్ నెలలో శని ఉదయించడం మూడు రాశుల జీవితంలో ఊహించని మార్పులు తీసుకురానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 02 2026, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Saturn Transit
Image Credit : Asianet News

Saturn Transit

వేద జోతిష్యశాస్త్రంలో శని అన్ని గ్రహాలలో కెల్లా చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. శని ఒక రాశిలోకి అడుగుపెట్టాడు అంటే.. రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటాడు. శని కర్మ, న్యాయం, శిక్షను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. శని ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండటం వల్ల, దాని శుభ, అశుభ ప్రభావాలు కూడా ఎక్కువ కాలం ఉంటాయి. శని సంచారం లేదా రాశి మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. శని ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. త్వరలో ఏప్రిల్ నెలలో తన సంచారాన్ని మార్చబోతున్నారు. ఏప్రిల్ నెలలో శని మీన రాశిలో ఉదయించడం వల్ల, కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది.డబ్బు విషయంలో మంచి స్థాయికి వెళతారు. కోటీశ్వరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కెరీర్, వ్యాపారంలో కూడా పురోగతి సాధిస్తారు. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...

24
ధనుస్సు రాశి...
Image Credit : Asianet News

ధనుస్సు రాశి...

శని గ్రహం ఈ ధనుస్సు రాశి నాలుగో ఇంట్లో ఉదయిస్తుంది. ఇది మీకు అన్ని రకాల సంతోషాలను అందిస్తుంది. ఈ సమయంలో, ధనస్సు రాశివారు భౌతిక సుఖాలను అనుభవిస్తారు. మీరు ఒక విలాసవంతమైన వస్తువును కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగలు చేయడానికి కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. మీ వ్యాపారం భూమి, రియల్ ఎస్టేట్ లేదా ఆస్తికి సంబంధించినది అయితే.. మీరు మంచి లాభాలు పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి నుండి పదో ఇంటిపై శని ఏడో దృష్టి పడటం వల్ల, మీరు మీ పని, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఆఫీసులో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Related image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు...ఈ రాశులకు ఐశ్వర్య ప్రాప్తి..!
34
మకర రాశి..
Image Credit : Asianet News

మకర రాశి..

శని గ్రహం మీన రాశిలో ఉదయించడం వల్ల.. మకర రాశివారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. శని మీ రాశి నుండి మూడో ఇంట్లో ఉదయిస్తాడు. ఇది మీ ధైర్యాన్ని, సాహసాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు ఆస్తి, భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు చేసే పనుల వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు. వ్యాపారం, విదేశీ వ్యవహారాలకు సంబంధించినది అయితే...మరింత ఎక్కువ లాభాలు పొందుతారు. తోబుట్టువుల నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం అందుతుంది.

44
మిథున రాశి...
Image Credit : Asianet News

మిథున రాశి...

మీన రాశిలో శని ఉదయించడం.. మిథున రాశి వారికి చాలా అనుకూలంగా మారనుంది. శని మీ రాశి నుండి కర్మ స్థానంలో ఉదయిస్తున్నాడు. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Recommended image2
Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Recommended image3
Shukra Gochar: మార్చిలో ఈ 2 రాశుల వారి జీవితం మార‌నుంది.. నాలుగు సార్లు శుక్ర గ‌హ సంచారం
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు...ఈ రాశులకు ఐశ్వర్య ప్రాప్తి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved