ఈవారం ( సెప్టెంబర్ 20 నుంచి 26వరకు) రాశిఫలాలు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వేరు వేరు రూపాల్లో సంప్రదింపులు చేస్తారు. అనేక రకాల వార్తలు కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల సహకారం కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాదులకు అవకాశం ఏర్పడుతుంది. విహార యాత్రల్లో కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలకు అనుకూల సమయం. సౌఖ్యంగా గడుపుతారు. గృహ, వాహనాది వ్యవహారాల్లో మంచి నిర్ణయాదులుంటాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. క్రియేివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానంతో సంతోషం. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సమస్యలున్నా అధిగమిస్తారు. నిల్వధనం పోకుండా చూసుకోవాలి. సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. మాతృవర్గం వారి సపోర్ట్ దొరుకుతుంది. మీడియా రంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నిర్ణయాదులకు అనుకూలం అవుతాయి. ఆత్మ విశ్వాసం ఉన్నా ఇతరుల భావాలకు లొంగిపోతుటాంరు. సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది. బాధ్యతలు అధికమౌతాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాదులు విస్తరించుకునే ప్రయత్నం. అపోహలు లేకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. కుటుంబంలో అన్నీ శుభపరిణామాలు. బంధువర్గం వారు సంతోషాన్నిస్తారు. నిల్వధనం పెరుగుతుంది. మాటతీరు వల్ల సంతోషం పెరుగుతుంది. ఆత్మయత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్‌లో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఖర్చులు పెట్టుబడులు అత్యధికం అవుతాయి. పరామర్శలకు అవకాశం. సౌఖ్యంగా గడపాలనే ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు, సౌకర్యాలు, సౌఖ్యంకోసం కాలం ధనం బాగా వెచ్చించాల్సి వస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. సంప్రదింపుల్లో శుభపరిణామాలు ఏర్పడతాయి. మంచి వార్తలు వింరు. వ్యతిరేకతలు ఇబ్బంది పెడతాయి. పోటీ రంగంలో సమస్యలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి. గుర్తింపు గౌరవాదులు పెంచుకుంటారు. ఆహారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : లాభాలు సంతోషాన్నిస్తాయి. అత్యధిక ప్రయోజనాలను ఆశిస్తారు. శ్రమ లేకుండా ఫలితాలు పొందాలనే భావాలు వస్తుటాంయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మానసికమైన ఒత్తిడులకు కూడా అవకాశం ఉంది. నిర్ణయాదులు ఆలస్యం అవుతాయి. పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకోసం ధనం, కాలం వెచ్చిస్తారు. ప్రయాణాదులుంటాయి. విహార యాత్రలకు కూడా అవకాశం ఉంటుంది. సౌఖ్యంగా గడుపుతారు. పూర్తి విశ్రాంతి లభిస్తుంది. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. వేరు వేరు బాధ్యతలతు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. నిర్ణయాదులు సమస్యలకు గురి చేయవచ్చు. శ్రమాధిక్యం. కృషితో సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో సమస్యలుంటాయి. అన్ని రకాలుగా ధన ధాన్య లాభాలు ప్రభావితం చేస్తాయి. ఏ పని చేసినా ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లాభిస్తాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఏర్పడుతుంది. సుదూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చులు పెట్టుబడులు కూడా ఉంటాయి. సంప్రదింపుల్లో సమస్యలు వస్తాయి. సేవకర్గ సహకారం మాత్రం లభిస్తుంది. ఉన్నతమైన విద్యలు వైజ్ఞానిక భావాలు విస్తరించే అవకాశం ఉంది. వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆహార విహారాల్లో శుభపరిణామాల్లో సంతోషం కలుగుతుంది. సంతోషంగా గడుపుతారు. గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులకు అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లోపాలుంటాయి. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్పడతాయి. మాట విలువ తగ్గే సూచనలు. ముఖ్యమైన నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. అన్ని పనుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సుదూర ప్రయాణాలకు అవకాశం. వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు అనుకూలం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : భాగస్వామ్యాలపై దృష్టి ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాల్లో జాగ్రత్త వహించాలి. భాగస్వామితో కొంత అప్రమత్తంగా మెలగాలి. కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలున్నాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కాని బద్ధకంగా ఉంటుంది. పనులను వాయిదా వేస్తుటాంరు. ఆరోగ్య సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. నిర్ణయాదులను వాయిదా వేయడం మంచిది. అనుకోని సమస్యలు, ఊహించని సంఘటనలకు అవకాశం ఏర్పడుతుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పోటీ లు అధికం అవుతాయి. ఒత్తిడులతో కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. కార్యనిర్వహణలో శ్రమ పెరుగుతుంది. ఋణాలు, రోగాలు శ్రమకు గురి చేయవచ్చు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. విజయ సాధన అవసరం. పోటీ రంగంలో గుర్తింపు ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులకు ప్రయాణాలకు అవకాశం. అసంతృప్తి ఉంటుంది. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మ విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గౌరవ మర్యాదలుంటాయి. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మానసికమైన సంతోషం ఏర్పడుతుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొంత ఆందోళన కూడా ఉంటుంది. దైవధ్యానం తప్పనిసరి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు .గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. పోటీ ల్లో విజయం సాధిస్తారు. ఋణాదులను అధిగమిస్తారు. ఖర్చులు పెట్టుబడులు కూడా ఉంటాయి. ప్రయాణావకాశాలు ఆశించిన విశ్రాంతి అందకపోవచ్చు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆహార విహారాలపై దృష్టి ఏర్పడుతుంది. సౌఖ్యం కోసం ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాది సౌకర్యాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో ముందు జాగ్రత్తలు అవసరం. విద్యారంగంలోని పిల్లలకు శ్రమాధిక్యం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. పదోన్నతులు వాయిదా పడే సూచనలు. వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలం. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన చేస్తారు. అన్ని పనుల్లోనూ సంతోషం ఏర్పడుతుంది. క్రియేటివిటీతో పనిచేస్తారు. ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ఉంటుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు.