MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • వార ఫలాలు 12 నవంబర్ నుంచి 18 నవంబర్ 2021

వార ఫలాలు 12 నవంబర్ నుంచి 18 నవంబర్ 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి . చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 12 2021, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు కలసివస్తాయి. నూతన గృహయోగాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. రాజకీయవర్గాలకు ఉత్సాహం.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సత్కారాలు. రాజకీయ నాయకులకు గౌరవ పదవులు. పారిశ్రామికవర్గాల కోరిక నెరవేరుతుంది.  వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రుల సూచనలతో ముందుకు సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

  
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహం.  వారం ప్రారంభంలో రుణయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యం వల్ల పనులలో జాప్యం. కుటుంబంలో సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పనులలో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు  నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబసమస్యలు సవాలుగా మారతాయి. విద్యార్థులు మరింత శ్రమపడాలి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. ప్రముఖులతో పరిచయాలు. కళాకారులకు సభా మర్యాద, సత్కారాలు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొందరికి పదవులు దక్కవచ్చు. వారం చివరిలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం అనుకున్న పనులు  విజయవంతంగా సాగుతాయి. సన్నిహితులు సహాయపడతారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలు ఆప్తులతో పంచుకుంటారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. వాహనయోగం.  ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రాజకీయ వర్గాలకు అనూహ్య పదవీలాభం. వారం మధ్యలో ధనవ్యయం. అకాల భోజనం, అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొద్దిపాటి చికాకులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో ఊహించని ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.  కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి అవుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1214

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. అధికారుల మన్నన పొందుతారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Recommended image3
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved