మిథున రాశివారికి ఈ విషయాలు అస్సలు చెప్పకూడదు తెలుసా..?
ఈ రాశివారు చాలా తెలివిగలవారు. సరాదాగా ఉండటానికి ఇష్టపడతారు. అందరూ తమతో ఉన్నవారు కూడా సరదాగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా సీరియస్ గా ఉంటే.. అస్సలు ఒప్పుకోరు.

మిథున రాశివారు చాలా చమత్కారంగా ఉంటారు. అంతేకాదు... ఎవరినైనా ఇట్టే మోసం చేయగలరు. వీరిలో ఒకటి, రెండు కాదు.. చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ రాశివారు చాలా తెలివిగల వారు. వీరి ముందు మీరు ఎలాంటి నాటకాలు వేయలేరు. కాబట్టి.. ఈ రాశివారు కొన్ని విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది. ఈ రాశివారికి ఎలాంటి విషయాలు చెప్పకుండా ఉంటే మంచిదో ఇప్పుడు చూద్దాం..
ఈ రాశివారు... చాలా టాకిటివ్. వీరు ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారు. వీరికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. ఇతరుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎదుటివారిపై జోక్స్ వేస్తూ ఉంటారు. ఆ జోక్స్ ని సీరియస్ గా తీసుకొని వారిని ఏదైనా అన్నారంటే.. ఇక అంతే.. వారు మీతో మాట్లాడటం మానేస్తారు. వారు మీతో ఏ విషయాన్ని షేర్ చేసుకోవడానికి కూడా ముందుకు రారు. కాబట్టి.. వీరితో రిలేషన్ సరిగా ఉండాలి అంటే.. వారి జోక్స్ బ్యాడ్ అనే విషయాన్ని కూడా వారికి చెప్పకపోవడం బెటర్.
ఈ రాశివారు చాలా తెలివిగలవారు. సరాదాగా ఉండటానికి ఇష్టపడతారు. అందరూ తమతో ఉన్నవారు కూడా సరదాగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా సీరియస్ గా ఉంటే.. అస్సలు ఒప్పుకోరు. సరదాగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే.. వారు అలా చేయడం మీకు ఇష్టం లేదు అనే విషయాన్ని కనుక చెప్పినా.. వారిని ప్రశ్నించినా.. ఇక అంతే. మళ్లీ మీ ముఖ్ కూడా చూడరు.
Gemini
మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారా..? ఈ ప్రశ్న మిథున రాశివారిని అస్సలు అడగకూడదు. వీరికి ఆ ప్రశ్న అస్సలు నచ్చదట. ఎందుకంటే ఈ రాశివారు.. తమ పట్ల తాము చాలా గర్వంగా ఫీలౌతుంటారు. అన్నింట్లో తాము తోపు అని ఫీలౌతూ ఉంటారు. కాబట్టి.. అలాంటవారిని ఈ ప్రశ్నలు అడిగితే.. ఈ రాశివారికి అస్సలు నచ్చదు.
మిధున రాశి వారు ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు ఎప్పటికప్పుడు మారుతున్న నిర్ణయాలు తీసుకుంటారు. ఆ మార్పులతో వారు మారవచ్చు. సర్దుబాటు చేయగలరని వారికి తెలుసు. కాబట్టి వారి సామర్థ్యాలను ప్రశ్నించవద్దు.