వాస్తు ప్రకారం అస్సలు చేయకూడని పనులు ఇవే..!
దక్షిణ భాగంలో పొరపాటున కూడా తులసి మొక్కని ఉంచకూడదు. ఈశాన్య లేదంటే, తూర్పు మూల ఉంచుకోవడం మంచి శకునం.
చాలా మంది ఇళ్లు కొనే సమయంలో కచ్చితంగా వాస్తు చెక్ చేసుకుంటారు. కానీ, ఆ తర్వాత మాత్రం కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లోని కొన్ని వస్తువుల విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. మరి చేయకూడని పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం...
చాలా మంది ఇంటి ముందు నేమ్ ప్లేట్స్ పెట్టుకుంటారు. అయితే, ఆ నెంబర్ ప్లేట్స్ నలుపు రంగులో ఉండకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
vastu pooja room
ఇక ఇంట్లోని పూజ గదిలో చాలా మంది కొన్ని వస్తువులు ఉంచరట. కానీ వాస్తు ప్రకారం ధూపం, కర్పూరం లాంటి వస్తువులను పూజ గదిలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది ఇంట్లో పాజిటివిటీని పెంచుతుంది.
ఇక చాలా మంది హాల్ లో టీవీ ఉంచుకునట్లే, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు. కానీ పొరపాటున కూడా బెడ్రూమ్ లో టీవీ ఉండకూడదట. ఇది నిద్రను భంగం చేస్తుంది. కావాలంటే ఏదైనా లైట్ మ్యూజిక్ పెట్టుకుంటే సరిపోతుంది.
tulsi
ఇంటికి దక్షిణ భాగంలో పొరపాటున కూడా తులసి మొక్కని ఉంచకూడదు. ఈశాన్య లేదంటే, తూర్పు మూల ఉంచుకోవడం మంచి శకునం.
sleeping
వాస్తు ప్రకారం నిద్రపోయే పొజిషన్ కూడా చాలా అవసరం తల దక్షిణం వైపు కాళ్లు, ఉత్తరం వైపు అస్సలు పెట్టుకూడదు. అలా పడుకొని నిద్రపోవడం మంచిది కాదు.
library book old
మీ ఇంట్లో స్టడీ రూమ్ లేదంటే లైబ్రరీ ఉంటే, ఆ గది గోడలకు పేస్టల్ కలర్స్ ఎంచుకోవడం మంచిది. అది వాస్తు ప్రకారం చాలా మేలు చేస్తుంది.
ఇంటి టెర్రస్ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పొరపాటున కూడా చెత్త చేయకూడదు. చేసినా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
పూజ గదిని చాలా పవిత్రంగా చూసుకోవాలి. ఎంత అవసరం అయినా, పూజ గదిలో నిద్రపోవడం లాంటివి చేయకూడదు. ఇది ఇంటికి మంచిది కాదు.
ఇంట్లో కిచెన్ గదిలో వంట చేసే దిశ దక్షిణం వైపు ఉండకుండా చూసుకోవాలి. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.