MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Pind Daan: బతికుండగానే తమకు తామే ఈ ఆలయంలో పిండ ప్రదానం చేసుకుంటారు, ఎందుకో తెలుసా?

Pind Daan: బతికుండగానే తమకు తామే ఈ ఆలయంలో పిండ ప్రదానం చేసుకుంటారు, ఎందుకో తెలుసా?

పితృపక్షంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని వారికి శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ  మన దేశంలో ఉన్న ఒక ఆలయంలో మాత్రం జీవించి ఉన్నవారు తమకు తామే పిండ ప్రదానం (Pind Daan) చేస్తారు. ఆ దేవాలయం ఎక్కడ ఉందో? అలా ఎందుకు చేస్తారో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 15 2025, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పితృ పక్షంలో పిండప్రదానం
Image Credit : Freepik

పితృ పక్షంలో పిండప్రదానం

హిందూ ధర్మంలో పితృ పక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులు 15 రోజుల పాటు భూమి మీదకి వస్తారని అంటారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పితృ దేవతలకు శ్రాద్ధ కార్యక్రమాలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల మరణించినవారి ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు.  వారు సంతృప్తి చెంది తమ లోకానికి తిరిగి వెళతారనే నమ్మకం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మరణించిన వారికే పిండ ప్రదానం
Image Credit : Freepik

మరణించిన వారికే పిండ ప్రదానం

సాధారణంగా శ్రాద్ధం, పిండ ప్రదానం మరణించినవారికి మాత్రమే చేస్తారు. అంటే, మరణించిన వ్యక్తులు పితృ దేవతలు అవుతారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు పితృపక్షంలో పితృల శ్రాద్ధం చేస్తారు. దీనివల్ల వారు మోక్షం పొందుతారని నమ్మకం. 

36
ఇక్కడ తమకు తామే పిండ ప్రదానం
Image Credit : X @Anirudh_Astro

ఇక్కడ తమకు తామే పిండ ప్రదానం

మన దేశంలో ఒక దేవాలయం ఉంది. ఈ ఆలయంలో జీవించి ఉన్న వ్యక్తి వెళ్లి తన పిండ ప్రదానం చేసకోవచ్చు. ఈ దేవాలయం బీహార్‌లోని గయాలో ఉంది. ధార్మిక గ్రంథాలలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది.

46
గయ ప్రాముఖ్యత
Image Credit : Getty

గయ ప్రాముఖ్యత

నమ్మకాల ప్రకారం  గయలోని ఈ ఆలయానికి వెళ్లి  పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడం వల్ల వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. పూర్వీకుల రుణం నుండి విముక్తి లభిస్తుంది. త్రేతాయుగంలో, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత గయలో ఫల్గుణ నది ఒడ్డున దశరథుడి శ్రాద్ధం, పిండ ప్రదానం చేశారని చెబుతారు.

56
బతికుండగా పిండ ప్రదానం ఎందుకు?
Image Credit : Getty

బతికుండగా పిండ ప్రదానం ఎందుకు?

గయలో దాదాపు 54 పిండ దేవతలు, 53 పవిత్ర స్థలాలు ఉన్నాయి. అక్కడ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తే మంచిదని నమ్ముతారు. ఇక్కడ జనార్ధన మందిరం వేదిక ఉంది. ఇక్కడ ప్రజలు బతికుండగానే మరణానంతరం మోక్షం పొందడానికి తమకు తామే పిండ ప్రదానం చేసుకుంటారు.

66
శ్రాద్ధం చేయడానికి ఇదే కారణం
Image Credit : Getty

శ్రాద్ధం చేయడానికి ఇదే కారణం

సాధారణంగా, సంతానం లేనివారు లేదా కుటుంబంలో పిండ ప్రదానం చేసేవారు ఎవరూ లేని వారు మాత్రమే గయాకు వెళ్లి తమకు తామే పిండ ప్రదానం చేసుకుంటారు. అలాంటి వారు తమ ఆత్మకు శాంతి కలగాలని బతికుండగానే పిండ ప్రదానం చేస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
దీపావళికి మాత్రమే తెరిచే ఆలయం గురించి విన్నారా? ఇది ఎక్కడుందంటే?
Recommended image2
Shakuni: కురుక్షేత్ర యుద్ధానికి కారకుడైన శకుని ఎలా మరణించాడు? అతనికి గుడి ఎందుకు కట్టారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved