- Home
- Astrology
- Zodiac signs: డిసెంబర్ లో ఈ రాశుల వారికి ఖర్చు తక్కువ, డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు..!
Zodiac signs: డిసెంబర్ లో ఈ రాశుల వారికి ఖర్చు తక్కువ, డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు..!
Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం పదకొండో ఇంటి ద్వారా ఆదాయం నిర్ణయిస్తారు. పన్నెండో ఇంటి ద్వారా ఖర్చుల నిర్ణయిస్తారు. ఈ రెండూ కరెక్ట్ గా ఉంటే, ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి.

డబ్బు విషయంలో అదృష్ట రాశులు...
జోతిష్యం ప్రకారం డిసెంబర్ లో కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. ఈ రాశుల పదకొండో ఇల్లు బలంగానూ, పన్నెండో ఇల్లు బలహీనంగానూ ఉంటుంది. దీని వల్ల వీరికి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. దీని కారణంగా వీరు ఎక్కువగా సంపాదించగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దామా.....
1.మేష రాశి....
మేష రాశివారికి లాభాల ఇంట్లో రాహువు సంచారం చేస్తాడు. దీని వల్ల వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఖర్చుల ఇంట్లో శని సంచారం చిన్న ఖర్చులు, చిన్న ఆర్థిక నష్టాలకు కారణమయ్యే అవకాశం ఉంది. కానీ, ఆదాయం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి వీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమౌతాయి. స్టాక్స్, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడుల కారణంగా లాభాలు పొందుతారు.
2.వృషభ రాశి...
ఈ రాశి లాభాల ఇల్లు ఖర్చుల ఇల్లు కంటే బలంగా ఉన్నందున, వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. లాభానికి అధిపతి అయిన బృహస్పతి సంపదకు అధిపతిగా ఉండటం వల్ల ఆదాయంలో తగ్గుదల ఉండదు, కానీ పెరుగుదల ఉంటుంది. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం, జాగ్రత్తగా ఖర్చులు నిర్వహించడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు , ఆర్థిక లావాదేవీలు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది.
3.కర్కాటకం:
ఈ రాశి వారికి, లాభానికి అధిపతి అయిన శుక్రుడు ఏడాది పొడవునా నాలుగు లేదా ఐదు ఇళ్ల ద్వారా సంచరిస్తాడు. అదృష్టానికి అధిపతి అయిన బృహస్పతి ఈ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు, కాబట్టి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఖర్చులు మాత్రం తక్కువగా ఉంటాయి. పెట్టుబడులతో సహా వివిధ వనరుల ద్వారా అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి
సంపదకు అధిపతి అయిన బృహస్పతి దాని ఉచ్ఛ స్థితిలో ఉండటం, లాభానికి అధిపతి అయిన సూర్యుడు సంపదకు అధిపతిగా ఉండటం వల్ల తులారాశి వారికి ఆదాయానికి కొరత ఉండదు. ఈ రాశి కింద జన్మించిన వారి ఆదాయం రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంది. వీరికి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. షేర్లు, చిన్న వ్యాపారాలు , వడ్డీ వ్యాపారాలలో పెట్టుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి.
ధనుస్సు:
ఈ రాశి వారికి, శుక్రుడు లాభదాయక ఇంట్లో సంచరిస్తున్నాడు. బృహస్పతి ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. కాబట్టి, ఈ రాశి వారు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల చూస్తారు. కుజుడు ఖర్చుల ఇంట్లో ఉన్నందున, ఖర్చు వివేకవంతంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉంది. సంపద పేరుకుపోతుంది.
మకరం:
లాభాధిపతి కుజుడు , అదృష్టాల అధిపతి బుధుడు లాభదాయక ఇంట్లో , సంపదల అధిపతి బృహస్పతి ఏడవ ఇంట్లో కలయిక అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారాలు , వృత్తులలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా సాధ్యమే. తెలివిగా ఖర్చు చేస్తే... ఆదాయం రెట్టింపు అవుతుంది.