Zodiac signs: ఈ రాశులవారు మహాభారతంలో కర్ణుడు లాంటివారు, అడిగిన వాళ్లకు నో చెప్పరు..!
Zodiac signs: కొందరిలో సహజంగా దాన గుణం ఉంటుంది. ఇతరులు ఏది అడిగినా కూడా నో చెప్పలేరు. అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. సహాయం చేయడానికి ఏ మాత్రం వెనకాడరు.

Zodiac signs
జోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి. కొంత మంది తాము చేసే ప్రతి పనికీ ప్రతి ఫలం ఆశిస్తారు. కొందరు అలా కాదు. తెలిసిన వారికీ, తెలియని వారికి సహాయం చేయడంలో ముందుంటారు. మహా భారతంలో కర్ణుడిలా అడిగిన అందరికీ దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు. మరి, జోతిష్య శాస్త్రంలో అలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయో ఓ సారి చూద్దాం....
1.మీన రాశి...
మీన రాశివారు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు. ఈ రాశివారు చాలా దయగా ఉంటారు. ఈ రాశిని బృహస్పతి గ్రహం పాలిస్తూ ఉంటుంది. అందుకే.. ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. ఇతరులకు హాని చేయాలనే ఆలోచన కూడా వీరికి రాదు. ఇతరుల కోసం చెడుగా ఆలోచించరు. తమ శత్రువులు కూడా సంతోషంగా ఉండాలని వీరు అనుకుంటారు.తమతో ఎలాంటి సంబంధం లేని వారికి కూడా తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులు, ఆస్తి రాసివ్వడంలో కూడా ఏ మాత్రం ఆలోచించరు.
2.సింహ రాశి...
సింహ రాశిని సూర్యుడు పాలిస్తూ ఉంటాడు. ఈ రాశివారు కూడా నిరంతరం ఇతరుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇతరులకు వీలైనంత మంచి చేయడానికి వీరు ముందుంటారు. వీలైనంత వరకు పేదలకు, అవసరంలో ఉన్నవారికి తమకు తోచిన సహాయం చేస్తారు. దేవాలయాలు, అనాథ ఆశ్రమాలకు కూడా దానం చేస్తూ ఉంటారు. పేదల ఆనందంలో తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ రాశివారు సహజంగా చాలా ఉదారంగా ఉంటారు. దానధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని వీరు నమ్ముతారు.
3.ధనస్సు రాశి...
ధనస్సు రాశిని బృహస్పతి గ్రహం పాలిస్తూ ఉంటుంది. అందుకే ఈ రాశి వారికి ధైర్యం, తెలివితేటలు, ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువ. ఈ రాశివారు చాలా సాహసోపేతంగా ఉంటారు. అంతేకాదు, అవసరంలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అందరూ సంతోషంగా ఉండాలని వీరు అనుకుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు.
4.కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారు కూడా ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ రాశిని చంద్రుడు పాలిస్తాడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ ప్రియమైనవారి పట్ల ఉదారంగా ఉంటారు. తమ స్వంత ప్రయోజనాల కంటే తమ ప్రియమైనవారి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. తమకు పరిచయం లేని వారి కి కూడా వీరు సహాయం చేస్తారు.