- Home
- Astrology
- Lakshmi Narayana Yoga: లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్, జీతంలో పెరుగుదల
Lakshmi Narayana Yoga: లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్, జీతంలో పెరుగుదల
శుక్ర, బుధ గ్రహాలు కలిసి లక్ష్మీ నారాయణ యోగం (Lakshmi Narayana Yoga) ఏర్పడుతుంది. ఆ రెండు గ్రహాలు ఇప్పుడు ఒకే రాశిలో (Zodiac Signs) కలవబోతున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. వారు ఉద్యోగపరంగా ఎదుగుతారు.

లక్ష్మీ నారాయణ యోగం
వృశ్చిక రాశిలో బుధ, శుక్ర గ్రహాలు కలిశాయి. వీటి కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం అక్టోబర్ నెలలో ఏర్పడుతుంది. దీని ప్రభావంతో 3 రాశుల వారిపై అధికంగా ఉంటుంది. వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ రాశుల వారికి ఈ యోగం కలిసివస్తుందో తెలుసుకోండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ యోగం అద్భుతంగా కలిసివస్తుంది. వారికి బుధ, శుక్రుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి సంపద పెరిగే అవకాశం ఉంది. కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకుంటారు. వీరికి ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి.
మకర రాశి
మకర రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం ప్రయోజనంగా ఉంటుంది. వృత్తి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో వారికి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి బుధ, శుక్రుల కలయిక ఎంతో మంచిది. వ్యాపారస్తులకు ఇది అద్భుతమైన సమయం. అన్ని రకాలుగా కలిసివస్తుంది. వీరికి కెరీర్ లో ఎన్నో ఉత్తమ అవకాశాలు వస్తాయి.